Today (17-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజున ఇవాళ శుక్రవారం ఎక్కువ శాతం నెగెటివ్ ట్రెండ్‌లోనే నడిచింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని దెబ్బతీశాయి. బ్యాంకింగ్ మరియు రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
చివరికి.. సెన్సెక్స్.. 316 పాయింట్లు తగ్గి 61 వేల 2 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 17 వేల 944 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బీఎస్‌ఈలోని మొత్తం 30 కంపెనీల్లో 23 కంపెనీలు తక్కువ వ్యాల్యూ వద్దే సెటిలయ్యాయి. సెన్సెక్స్‌లో టీసీఎన్‌ఎస్ క్లాతింగ్, శిల్పా మెడికేర్, టిమ్కెన్ ఇండియా, స్కేఫ్లర్ ఇండియా మరియు అదానీ పవర్ బాగా రాణించాయి.
100 Airports: వచ్చే ఏడాది నాటికి అభివృద్ధిపరచనున్న కేంద్రం
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, వొడాఫోన్ ఐడియా షేర్ల విలువలు నేల చూపులు చూశాయి. నిఫ్టీలో మీడియా సూచీ స్వల్ప లాభాలు ఆర్జించింది. మిగతా సెక్టార్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగాయి. ఐటీ, ఫర్మా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఇండెక్స్‌లు అధికంగా సున్నా పాయింట్ ఏడు శాతం వరకు దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ స్టాక్స్ వ్యాల్యూ 9 శాతానికి పైగా పెరిగింది. ఈ సంస్థకు దాదాపు 60 కోట్ల రూపాయల ఆర్డర్ రావటం కలిసొచ్చింది. LPCA ల్యాబొరేటరీస్ షేర్ల విలువ 5 శాతం పడిపోయింది. తద్వారా 52 వారాల కరిష్ట విలువ అయిన 818 రూపాయల 25 పైసలకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 368 రూపాయి తగ్గింది.
గరిష్టంగా 55 వేల 860 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యీ 48 రూపాయలు నష్టపోయింది. అత్యధికంగా 64 వేల 480 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 91 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 409 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 11 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 80 పైసల వద్ద స్థిరపడింది.