Today (15-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది. దీంతో.. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగిసింది. రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్క్‌లకు పైనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 18 వేల పాయింట్లను మించటం విశేషం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది.
సెన్సెక్స్ ఒకానొక దశలో నేటి కనిష్ట విలువైన 60 వేల 750 పాయింట్లకు పడిపోయింది. చివరి సెషన్‌లో ఊపందుకోవటంతో తిరిగి 61 వేలు దాటింది. చివరికి.. సెన్సెక్స్.. 242 పాయింట్లు పెరిగి 61 వేల 275 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 86 పాయింట్లు బలపడి 18 వేల 15 పాయింట్ల వద్ద ఆగింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు పాజిటివ్ జోన్‌కి దగ్గరలో క్లోజ్ అయ్యాయి.
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
బీఎస్‌ఈలో టొరెంట్ పవర్, తేజాస్ నెట్‌వర్క్, జీఐసీ ఇండియా భాగా రాణించాయి. టీసీఎన్‌ఎస్ క్లాతింగ్, సీజీ పవర్, ఉల్ఫెక్స్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీలో ఐటీ మరియు రియాల్టీ, ఆటో ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ విలువ వరుసగా రెండో రోజు కూడా పెరిగింది.
డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు కనబరచటం ఈ సంస్థకు ప్లస్ అయింది. టెక్ మహింద్రా షేర్ వ్యాల్యూ దాదాపు ఆరు శాతం మెరుగుపడి వెయ్యీ 71 రూపాయలకు చేరింది. మరోవైపు.. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్ ఫార్మా ఒక్కో శాతం చొప్పున డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం రేటు 603 రూపాయలు పడిపోయింది.
అత్యధికంగా 56 వేల 147 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర ఏకంగా 992 రూపాయలు తగ్గిపోయింది. గరిష్టంగా 65 వేల 259 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 107 రూపాయిలు మైనస్ అయింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 459 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ రెండు పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.