Rashid Latif: “భారత్ ఓడిపోతుంది.. ఇది ఫిక్స్”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ షాకింగ్ ప్రిడిక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Latif: నేడు భారత్ vs ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సెమీస్ పోరుకు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఓ పాకిస్థాన్ వార్తా కార్యక్రమంలో మాట్లాడిన రషీద్.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడి పోతుందని, ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందని జోష్యం చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదుసార్లు తలపడగా టీమిండియా మూడు, ఇంగ్లీష్ జట్టు రెండు సార్లు విజయం సాధించాయి. మొదటి ప్రపంచకప్‌లో భారత్ 18 పరుగుల తేడాతో గెలిచింది. అదే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 2009 టోర్నీలో భారత్ మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2012లో భారత్ 90 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. పదేళ్ల తర్వాత జరిగిన మరో పోరులో మాత్రం ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. రెండు సంవత్సరాల తరువాత రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈసారి పరిస్థితులు ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉంటాయని రషీద్ లతీఫ్ భావిస్తున్నాడు. “సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ గెలుస్తుంది” అని చెబుతున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మంచి అనుభవాన్ని సంపాదించారన్నాడు. “ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లు రాణిస్తే చాలు. ఒక్క ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేసినా భారత్‌కు అది పెద్ద ప్రమాదమే” అని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారు? రషీద్ ప్రిడిక్షన్ సఫలమవుతుందా? వేచి చూద్దాం..
READ MORE: Undavalli Arun Kumar: సీఎం చంద్రబాబుకు ఉండవల్లి బహిరంగ లేఖ.. పోలవరం నిర్మాణంపై ఆందోళన..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!