India vs England: బుమ్రా-అర్ష్‌దీప్ vs ఆర్చర్-కర్రన్.. లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England: నేడు సెమీస్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. భారత్ vs ఇంగ్లాండ్ జట్లు మధ్య భీకర పోరును వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్ల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఓ వైపు ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా దూసుకుపోతుంది. మరోవైపు.. సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్ అత్యంత వేగంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టు ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్ సేన ఇప్పటికే అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. అయితే.. ఈ రెండు జట్లలో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రధాన ఆయుధాలుగా మారనున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే భారత జట్టుకు కీలక బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు మొత్తం 93 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 116 వికెట్లు సాధించాడు. బౌలింగ్ నియంత్రణ అద్భుతంగా ఉంది. ప్రతి ఓవరుకు సగటున కేవలం 6.53 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కష్టమైన సమయంలో వికెట్లు తీయడంలో బుమ్రా ఎంతో నిపుణుడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అర్షదీప్ సింగ్ సైతం ఈ ఫార్మాట్‌లో ప్రపంచంలోని మంచి వేగ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 82 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 126 వికెట్లు తీసుకున్నాడు. ప్రతి ఓవరుకు సగటు 8.47గా ఉంది. చివరి ఓవర్లలోనూ ధైర్యంగా బౌలింగ్ చేయగలగడం అర్షదీప్ ప్రత్యేకత. ఇక ఇంగ్లాండ్ జట్టును పరిశీలిస్తే.. జోఫ్రా ఆర్చర్ ఫాస్ట్ బౌలింగ్ ఇరగ దీస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో వేగానికి పేరుగాంచిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 44 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 56 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ సగటు ప్రతి ఓవరుకు 8.14 పరుగులు. మరోవైపు.. సామ్ కర్రన్ సైతం ఫాస్ట్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 66 వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌలింగ్ సగటు ప్రతి ఓవరుకు 8.64 పరుగులు. ఈ గణాంకాలను చూస్తే రెండు జట్ల ఫాస్ట్ బౌలర్ల విభాగం అత్యంత బలంగా ఉంది. అందుకే ఈ అర్ధ ఫైనల్ పోరు మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..