Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్‌లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook: నిన్న జరిగిన టీమిండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠకు తెరలేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు. చివర క్షణం వరకు మ్యాచ్‌కు కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు తృటిలో ఓటమి పాలై ఇంటికి పయనమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన బిగ్ మిస్టెక్ మ్యాచ్ రూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ శామ్సన్ క్యాచ్‌ను మిస్ చేశాడు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం.. తన తప్పును బ్రూక్ ఒప్పుకున్నాడు. సంజూ శామ్సన్ ఈజీ క్యాచ్ తన చేతుల్లోంచి జారిపోవడమే మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని అంగీకరించాడు. అదే తప్పిదం చివరకు తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పాడు.
READ MORE: Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు
Also Read
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని సంజూ గాల్లోకి కొట్టాడు. ఆ సమయంలో అతడు కేవలం 15 పరుగుల దగ్గరే ఉన్నాడు. ఆ బంతి నేరుగా మిడ్ ఆన్ ప్రాంతంలో ఉన్న హ్యారీ బ్రూక్ వైపు వెళ్లింది. అది ఈజీ క్యాచ్. కానీ అనుకోకుండా బ్రూక్ చేతుల్లోంచి బంతి జారి నేలపై పడింది. ఆ ఒక్క క్షణమే మ్యాచ్ కథను పూర్తిగా మార్చేసింది. ఈ అవకాశాన్ని సంజూ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. లైఫ్ వచ్చిన తర్వాత వీరబాదుడు బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విజృంభించాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని వేగవంతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ ప్రతి సారి బౌండరీ కొట్టినప్పుడు కెమెరాలు బ్రూక్ ముఖాన్ని చూపించాయి. తన తప్పిదం ఎంత పెద్దదో అప్పుడు అతడికి స్పష్టంగా తెలిసినట్టే కనిపించింది.
తాజావార్తలు
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!