KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి.
చాలా మంది ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని తహతహలాడుతుంటారు. కానీ అధిక ధర కారణంగా కొనలేక పోతారు. ఫోన్ ధర తగ్గేందుకు కొంత మంది పాత హ్యాండ్సెట్లను అమ్ముతారు లేదా ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకమైన రీతిలో రూ.1.35 లక్షల విలువైన ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.40,470కే కొనుగోలు చేశాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Karthika Masam 2025: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి (అక్టోబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.. విశిష్టమైనదని స్కంద పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. అయితే.. ఈ మాసంలో తప్పక చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం..
Hyderabad: మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని కన్న కొడుకే హత్య చేసిన ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ దారుణం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ ప్రస్తుతం మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు షేక్ సాతక్ తన స్నేహితుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Atlas: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మొదటిసారి ఏఐ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చింది మాత్రం చాట్‌జీపీటీ వల్లే అని చెప్పాలి. ఓపెన్ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజన్లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎలాంటి ప్రశ్న అడిగా వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ ప్రత్యేకత. అయితే.. ఈ ఏఐ తాజాగా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. AI ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్న OpenAI, "అట్లాస్" అనే కొత్త వెబ్ బ్రౌజర్‌ను ప్రారంభించింది. ప్రపంచంలో…
Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకొన్నారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడాను. ఇద్దరం అద్భుతమైన సంభాషణ జరిపాం. వాణిజ్యం, అనేక విషయాలను చర్చించాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచం గురించి చర్చించుకున్నాం. ప్రపంచ వాణిజ్యంపై మోడీకి చాలా ఆసక్తి ఉంది. […]
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు రికార్డు స్థాయిలో సాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారు జామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.
Maharashtra: ఆరుగాలం శ్రమించినా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే అన్నదాత కళ్లలో ఆనందం ఉండదు. కొన్నిసార్లు పురుగు మందుల నుంచి కూలీల వరకు ఖర్చు చేసినా డబ్బు వెళ్లని పరిస్థితులుంటాయి. అప్పులు తెచ్చి వాటిని తీర్చలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా ఉల్లిగడ్డ సాగు చేసిన రైతుకు ఇదే పరిస్థితి నెలకొంది. అహోరాత్రులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోగా, కనీసం రవాణా ఖర్చులు కూడా మిగలని దయనీయ పరిస్థితి దాపురించింది. అసలు ఏం జరిగిందంటే..?
Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా పోటీకి రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని…
Warangal: జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.. కరీమాబాదులోని ఉర్సు దర్గా ఆటో స్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణలో చేపట్టారు... అనంతరం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు..