Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి.. దీపావళి సందర్భంగా నగరంలో టపాసుల మోత మోగింది. దీంతో నగరంలో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర స్థాయిలో కాలుష్యం చోటు చేసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అత్యధికంగా సనత్ నగర్లో PM 10 స్థాయి- 153 µg/m³ (మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్) గా నమోదైంది. న్యూ మలక్ పేట 164 µg/m³, కాప్రా 140 µg/m³, కోకాపేట 134 µg/m³, సోమాజిగూడ 122 µg/m³, రామచంద్రాపురం 122µg/m³,…
CM Revanth Reddy: పోలీస్ అంటే నమ్మకం.. విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోవడానికి సైతం మన పోలీసులు వెనుకంజ వేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరు మరణం పొందిన అమరవీరులకు నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు తరుపున ముఖ్యమంత్రిగా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 194 మంది తెలంగాణాలో ఆరుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని…
Human Rights Forum: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక కీలక ప్రకటన చేసింది. "ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా తీసుకొని, విచారణ జరిపి, చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నాం.. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.…
Maoist Party Telangana: ఇటీవల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. "విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని తీవ్రమైన నమ్మక ద్రోహం మల్లోజుల, ఆశన్న చేశారు..…
Police Commemoration Day: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లోని పోలీస్ మార్టియర్స్ మెమోరియల్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎం రేవంత్, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ విభాగం త్యాగస్ఫూర్తిని స్మరించుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.. నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. అసలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటామో ఇప్పుడు…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల […]
Hyderabad: సరోజినీ దేవి హాస్పిటల్లో బాణాసంచా కాలుస్తూ గాయపడిన వారి సంఖ్య వరుసగా పెరుగుతోంది. ప్రస్తుతం 70 మందికి పైగా బాధితులు చేరారు. ఇందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి సిబ్బంది వీరిలో ఇద్దరినీ ఇన్ పేషెంట్ గా చేర్చుకుంది. అవసరమైతే రేపు చికిత్స నిమిత్తం సర్జరీ చేసే అవకాశం ఉంటుందని డ్యూటీ డాక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను కలిశారు. రోగుల సంఖ్య, వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత…
Nizamabad: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారు జామున రియాజ్ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్ వద్ద పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో […]
Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు..
Nara Lokesh Australia Tour: ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు.. కీలకమైన పెట్టుబడులకు గమ్య స్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు లోకేష్..