Minister Konda Surekha Apologizes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర సేపు రాజకీయాంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది.
Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది.. బైక్ ను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు చెలరేగాయి.. మంటల్లో వోల్వా బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.. పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. హైవే పై వెళ్తున్న వాహనదారులు కూడా సహాయం చేశారు. బస్ లో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. తాజాగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికుడు కీలక సమాచారం వెల్లడించారు.…
Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా…
YS Jagan: ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. సీఎం సీట్లోకి చంద్రబాబు వచ్చి 18 నెలలు అయ్యిందని గుర్తు చేశారు. పెండింగ్ లో నాలుగు డీఏలు ఉన్నాయన్నారు.. ఇప్పటివరకు ఒక్క డీఏ ఇవ్వలేదు.. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్కటి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. మళ్ళీ నవంబర్ అంటున్నారని విమర్శించారు.. డీఏ అరియర్స్ కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామన్నారని.. చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదన్నారు.. కోవిడ్ లాంటి కష్ట సమయంలో…
YS Jagan: ఇక యాడ్ ఏజెన్సీల రాష్ట్ర ప్రభుత్వ పాలన అని మాజీ సీఎం జగన్ విమర్శించారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి.. పెర్ఫార్మెన్స్ మాత్రం వీక్ అన్నారు.. వేరే వాళ్ళకు దొరకాల్సిన క్రెడిట్ చోరీలో మాత్రం చంద్రబాబు పీక్ అని విమర్శించారు.. గత ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దే పనిలో భాగంగా అదానీ డేటా సెంటర్‌కు బీజం పడిందని తెలిపారు. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకువచ్చే కార్యక్రమానికి అంకురార్పణ…
India vs Australia: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి పరుగులు 264 సాధించింది భారత్. ఆస్ట్రేలియా టార్గెట్ 265 పరుగులు.
YCP ZPTC Murder: నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.. రోలుగుంట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. కత్తులు, కర్రలతో దాడి చేశారన్నారు. నిందితులను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నేపథ్యంలో మరికొంత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని వివరించారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన…
Former CM YS Jagan: రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో అమ్ముతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఇలాంటి మాఫియా ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరన్నారు.. ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ఆరోపించారు.. వాళ్ళ మనుషులకు ఏ రకంగా షాపులు వచ్చాయి.. వాళ్ళు ఎలా నడుపుతున్నారు అందరూ చూస్తున్నారన్నారు.. గ్రామాల్లో ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు నడుపుతున్నారని.. బెల్ట్ షాపులతో పాటు ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా విచ్చలవిడిగా కల్తీ…
Tuni Minor Rape Case: నారాయణరావు మైనర్ బాలికను ఐదుసార్లు బయటకు తీసుకుని వెళ్ళాడని డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు అత్యాచారం చేశాడని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. నారాయణ రావు ను మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్లే సమయంలో ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారు.. పర్సనల్ ఇష్యూ వల్ల వెహికల్ ఆపమని చెప్పాడు.. వెంటనే చెరువులో దూకేశాడు..
Rohit Sharma Hits His Slowest ODI Fifty: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు (అక్టోబర్ 23) అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. టాస్ ఓడిపోయిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. 24 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.