Mushroom Salad: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయానికి వస్తే.. మొదట చక్కెర కలిగిన ఆహారాన్ని తినొద్దు అని సలహా ఇస్తారు. మంచి ఫిట్‌నెస్ కోసం చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే సమోసాలు, పకోడాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాన్ని తినడం మొదలు పెడతారు. కానీ మీకు తెలుసా? ఈ ఆహారపదార్థాలు చక్కెర కంటే ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. అయితే మనం ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టము. ఇప్పటికైనా ఆయిల్ టిఫిన్స్ తినడం మానేయాలి. వాటికి బదులుగా ఓ మంచి సలాడ్ తింటే ఆరోగ్యంతో పాటు సమయం కలిసి వస్తుంది. అందుకే ఆర్గానిక్ మష్రూమ్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
READ MORE: Iran: ఇరాన్‌లో తీవ్రమవుతున్న నిరసనలు.. భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు
ఆర్గానిక్ మష్రూమ్ తయారీ విధానం..
బటన్ మష్రూమ్స్ 400 గ్రాములు: కాడలు తీసివేసి, పై భాగాన్ని పలుచగా ముక్కలు చేయాలి.
ఎర్ర ముల్లంగి 150 గ్రామూలు: శుభ్రపరచి, పలుచగా ముక్కలు చేయాలి..
ఫ్లాట్ లీఫ్ పార్స్లీ 50 గ్రాములు: కాస్త పెద్ద ముక్కలుగా తరిగినవి తీసుకోవాలి.
3 పచ్చి ఉల్లిపాయలు: జులియన్ స్టైల్‌లో పొడవుగా తరిగి పెట్టుకోవాలి.
సన్నగా తరిగిన పుదీనా ఆకులు అరకప్పు తీసుకోండి.
ఆర్గానిక్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 0.33 కప్పు తీసుకుందాం..
నిమ్మరసం అరకప్పు, సముద్ర ఉప్పు అర టీస్పూన్, తెల్ల మిరియాల పొడి చిటికెడు సిద్దం చేసుకుందాం.
పెద్ద మిక్సింగ్ బౌల్ లో వీటన్నింటినీ వేసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకుంటే.. ఆరోగ్య కరమైన సలాడ్ రెడీ.
ఇందులో 22 గ్రాముల కొవ్వు, 4 గ్రా ప్రోటీన్, 19 గ్రా కార్బోహైడ్రేట్లు, 3 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.