Tuni Rape Case: తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజక్షన్ చేయించాలని ఇప్పటివరకు మూడుసార్లు స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. తాను పాపకు…
Tuni Minor Rape Case: తుని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ హాస్పటల్కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నారాయణరావుని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు.
CM Chandrababu: దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషనుకు యూఏఈ పారిశ్రామికవేత్తలు రెస్పాండ్ అయ్యారు. సీఎం ప్రజెంటేషనుకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలు.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. వ్యవసాయం మొదలుకుని టెక్నాలజీ వరకు.
Tuni Minor Rape: దూకిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు తుని కోమటి చెరువులోకి దూకాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు. నారాయణరావు ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
AP: ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యథాతథంగా కొనసాగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నాట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా సాగనుంది. రూ.2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆషా డిమాండ్ చేస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..
TTD: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదలవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి.
Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం ఇస్తానని కాల్పులకు ఇబ్రహీం తెగబడ్డాడు.
Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో "జమాత్ ఉల్ ముమినాత్" పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం "జమాత్ ఉల్-ముమినత్" కోసం నియామకాలను విస్తరించడానికి తాజాగా మరో ప్లాన్ వేసింది.
Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర దేశం. భారతదేశం, పాకిస్థాన్లతో మన సంబంధాలు…
Story of Satish Prasad Singh: బీహార్ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్గా…