Maduro Videos: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) కార్యాలయంలోకి తీసుకెళ్తున్న కొత్త వీడియో బయటకు వచ్చింది. న్యూయార్క్‌లోని డీఈఏ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ వీడియో రికార్డ్ అయ్యింది. అమెరికా ప్రత్యేక దళాలు కారకాస్‌లో చేసిన మెరుపు దాడిలో మడురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కారకాస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలో ఉన్న నివాసంలో ఇద్దరూ నిద్రలో ఉండగా వారిని బంధించారు. ఆ తర్వాత వెనిజువెలా నుంచి అమెరికాకు తరలించారు.
READ MORE: Sarvam Maya : 10 రోజుల్లో రూ.100 కోట్లు.. యంగ్ హీరో మాస్ కంబ్యాక్
అయితే.. తాజా వీడియోను వైట్ హౌస్ అధికారిక రాపిడ్ రెస్పాన్స్ అకౌంట్ ‘రాపిడ్ రెస్పాన్స్ 47’ ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. అందులో 63 ఏళ్ల మడురో చేతులకు బేడీలు వేసి, నల్ల హుడీ ధరించి, న్యూయార్క్ డీఈఏ కార్యాలయంలోని నీలం కార్పెట్ ఉన్న మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ కార్పెట్‌పై “DEA NYD” అని ఉంది. ఆ సమయంలో మడురో అక్కడున్న అధికారులకు “గుడ్ నైట్”, “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పడం కూడా వినిపించింది. మరో వీడియోలో మడురో అమెరికా గడ్డపై దిగిన దృశ్యాలు కనిపించాయి. మొదట ఆయనను ఒక సైనిక స్థావరానికి తీసుకెళ్లి, ఆ తర్వాత న్యూయార్క్‌కు తరలించారు. డీఈఏ కార్యాలయం నుంచి మడురోను బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఇదే జైలులో గత ఏడాది ప్రముఖ ర్యాపర్ షాన్ “డిడ్డీ” కాంబ్స్ కూడా విచారణ సమయంలో ఉన్నాడు.
READ MORE: Sarvam Maya : 10 రోజుల్లో రూ.100 కోట్లు.. యంగ్ హీరో మాస్ కంబ్యాక్
మడురోను పట్టుకునేందుకు అమెరికా “ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్” పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో డెల్టా ఫోర్స్ సహా ఎలైట్ సైనిక దళాలు పాల్గొన్నాయి. కేవలం 30 నిమిషాల్లోనే మడురోను అదుపులోకి తీసుకున్నారు. స్టీల్‌తో బలపరిచిన సేఫ్ రూమ్‌లోకి పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయనను లాగి బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగలేదని వాషింగ్టన్ తెలిపింది. ఆగస్టు నుంచే మడురో ప్రతి కదలికపై రహస్య నిఘా పెట్టామని అమెరికా వెల్లడించింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా కదులుతున్నారు? ఏం తింటున్నారు? ఏ దుస్తులు ధరిస్తున్నారు? పెంపుడు జంతువులు ఏవి అన్న వివరాల వరకూ నిఘా పెట్టామని జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌కు ముందు నెలల పాటు కచ్చితమైన ప్రణాళిక, రిహార్సల్ జరిగిందన్నారు.
Perp walked.pic.twitter.com/34iIsFUDdG
— Rapid Response 47 (@RapidResponse47) January 4, 2026
URGENTE: Primera fotos y videos del narcotirano Nicolás Maduro #NicolasMaduro preso en New York. Maduro llevado a la oficina de la DEA La mejor noticia del mundo. Gracias Trump 🇺🇸 "VIVA VENEZUELA LIBRE" 🇻🇪 pic.twitter.com/v8zWhPqLnH
— Ape𝕏 (@CubanOnlyTrump) January 4, 2026