Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్‌లోని 10వ నంబర్లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన కుర్తాను చింపి, నేలపై పడుకుని, బిగ్గరగా…
Amitabh Bachchan: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే.. తాజాగా రిషబ్.. అమితాబ్ బచ్చన్ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి"లో కనిపించాడు.
No Kings Protest in USA: అమెరికాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీ నుంచి లండన్ వరకు మొత్తం 50 నగరాల్లో ఈ భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనలలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ నిరసనకు 'నో కింగ్స్' అని పేరు పెట్టారు. ఈ నిరసన సందర్భంగా ట్రంప్ వలస, విద్య, భద్రతా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే దీపావళి పండుగకు వేళైంది. అమావాస్య చీకట్లను తరిమికొట్టి జీవితంలో వెలుగు జిలుగులు నింపే సంతోషాల సంబరం వచ్చేస్తోంది. అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోనున్నారు. దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి, లక్ష్మీదేవి రాకను సూచిస్తూ చేసుకునే పండుగ. లక్ష్మీదేవిని సంపదకు పూజనీయమైన దేవతగా భావిస్తారు. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకొనే దీపావళి పండుగ రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవినీ ఆరాధిస్తాం. అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Alluri District: అల్లూరి జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది. ఓ పెద్ద బండరాయి కేకే లైన్లో పట్టాలపై జారిపడింది. టైడా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలో అరకు కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బండరాయి జారిపడినట్లు చెబుతున్నారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు…
PM Modi Kurnool Tour: ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనలో భద్రత లోపం వెలుగు చూసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుండిపెంట హెలిపాడ్‌లో ప్రధానికి వీడ్కోలు సమయంలో పాస్‌ల జాబితాలో లేని వ్యక్తుల ప్రవేశం కలకలం సృష్టించింది. ఇతరుల పేరుతో ఉన్న పాసులతో ప్రధాని వలయంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.
Pakistan Afghanistan Ceasefire: ఎట్టకేలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ దేశాలకు టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. సరిహద్దులో ఇటీవల జరిగిన…
Test-20: క్రికెట్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. "టెస్ట్ -20" పేరుతో సరికొత్త ఫార్మాట్‌ను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్‌లా రెండు ఇన్నింగ్స్ ఉండగా, టీ20 తరహాలో వేగంగా సాగబోయే ఈ కొత్త రూపం అభిమానులకు వినూత్న అనుభూతిని ఇవ్వబోతోంది. ఛాంపియన్షిప్ టోర్నీలాగా ఆడించాలని నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణీ భావిస్తున్నారు.
Fake ORS: హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై ఏళ్లుగా పోరాడింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యం దెబ్బతీసే విధంగా లేబుల్స్ ఉన్నాయని వాటిని నిషేధించాలని ఆమె పట్టుబట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్యశాఖలకు లేఖలు రాస్తూ వచ్చిందామే. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ వైద్యురాలి ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని కఠినమైన నిర్ణయాలను ప్రవేశపెట్టింది. అసలు ఏం జరిగింది..? ఆ వైద్యురాలు ఎవరు? అనే అంశాల…
Telangana Bandh: అసలే పండగ. మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో వలస వచ్చిన కార్మికులతో పాటు విద్యార్థులు పెట్టేబేడ సర్దుకుని సొంత స్థలాలకు పయణమయ్యారు. కానీ.. బస్టాండ్లకు చేరుకోగానే బస్సులు బంద్ అని తెలిసి అసహనం వ్యక్తం చేశారు. కొందరికి ముందే బంద్ అని తెలిసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.