పాకిస్థాన్ ప్రస్తుతం దైనీయ స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని వివరిస్తూ.. ఆ దేశ చట్టసభ చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పేర్కొన్నారు.
గూగుల్ సంస్థ మరో కొత్త ఫూచర్ ను తీసుకురాబోతోంది. ఇది వినియోగదారులకు మరింత నచ్చుతుందని గూగుల్ పేర్కొంది. ప్రాజెక్ట్ ఆస్ట్రా, గూగుల్ కొత్త మల్టీమోడల్ ఏఐ (AI) అసిస్టెంట్. ఈ సంవత్సరం గూగుల్ I/O తో, ఆండ్రాయిడ్ కంపెనీ, వర్క్‌స్పేస్, ఫోటోలు, ఇతర యాప్‌లలో సేవల కోసం ఏఐ ప్రయత్నాలు, మోడల్‌లు, ఫీచర్లను ప్రదర్శించింది.
ఇండిగో విమానం రద్దవడంతో మదర్స్ డే రోజు తన అమ్మను కలవలేకపోయానని.. అనుభా పాండే అనే జర్నలిస్ట్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 10.40 నిమిషాల విమానానికి ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా. ఈ కేసును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త తన కుమార్తె ముందే కత్తితో నరికాడు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాయాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్ స్టాప్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్‌ను తాకబోతున్నాయి.
వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.