హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ MK-1A (LCA తేజస్ MK1A)ని జూలైలో భారత వైమానిక దళానికి అందజేయనుంది. మొదటి విమానం మార్చిలో తయారు చేశారు. అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ సినిమాలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా బాగా పాపులర్ అయ్యింది. రష్మిక గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'యానిమల్'లో కనిపించింది.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు.
సీఎం నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసు రోజురోజుకూ ఊపందుకుంది. ఈ కేసులో పోలీసులు మలివాల్‌ను నాలుగు గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
చార్ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్ధాయ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఓ షూటర్‌ను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కి, దుండగులకు మధ్య అర్ధరాత్రి భల్స్వా డెయిరీ ప్రాంతంలో ఘర్షణ జరిగింది.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.