Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది..? నిపుణులు ఏమంటున్నారంటే..
- భారీగా పతనమవుతున్న సూచీలు..
- పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు..
- సపోర్ట్ లెవల్స్ కాపాడుకోలేకపోతున్న సూచీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా (Middle East) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude oil) ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి విలువ పడిపోవడం వంటివి స్టాక్ మార్కెట్‌ను భారీగా దెబ్బతీశాయి. వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో 1,579 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, చివరకు 1,470 పాయింట్ల (1.93%) నష్టంతో 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు 488 పాయింట్లు (2.06%) నష్టపోయి 23,151 వద్ద స్థిరపడింది. ఈ వారంలో నిఫ్టీ 5.3 శాతం, సెన్సెక్స్ 5.5 శాతం మేర నష్టపోయాయి. జూన్ 2022 తర్వాత నిఫ్టీకి ఇదే అతిపెద్ద వారపు నష్టం కావడం గమనార్హం.
Also Read:GST: తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం.. రూ.84 కోట్లు కొట్టేసిన కేటుగాడు..
Also Read
మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
మార్కెట్ ఇప్పుడు ‘ఓవర్ సోల్డ్’ (Oversold) స్థితిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే స్టాక్స్ చాలా తక్కువ ధరకు పడిపోయాయని అర్థం. బజాజ్ బ్రోకింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మార్కెట్ సూచీలు ఓవర్ సోల్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల త్వరలోనే మార్కెట్ కొంచెం కోలుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పటికైతే మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందనే సంకేతాలు (Reversal signs) ఏమీ కనిపించడం లేదు. మార్కెట్ తన పాత గరిష్ట స్థాయిలను అందుకుంటేనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. రిలిగేర్ బ్రోకింగ్ (అజిత్ మిశ్రా) అభిప్రాయం ప్రకారం.. ఓవర్ సోల్డ్ స్థాయిలో ఉన్నప్పటికీ, మార్కెట్ తన సపోర్ట్ లెవల్స్‌లను కాపాడుకోలేకపోతోందన్నారు. ముఖ్యంగా వడ్డీ రేట్లపై ఆధారపడిన రంగాలపై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోందన్నారు.
Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ (నాగరాజ్ శెట్టి) అభిప్రాయం ప్రకారం.. మార్కెట్ ధోరణి ప్రస్తుతం ప్రతికూలంగా ఉంది. వచ్చే వారంలో నిఫ్టి 22,900 స్థాయిల వద్ద చిన్నపాటి రికవరీ కనిపించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే, మార్కెట్ మరింత పడిపోయి 22,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తం 16 ప్రధాన రంగాల సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నదే మార్కెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?