రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయిదోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వత తొలిసారి చైనపర్యటనకు వెళ్లారు. గురువారం నుంచి రెండ్రోజల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు చైనా అధ్యక్షుడు షీ జన్ పింగ్ ను కలిశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించిన మహిళా కమిషన్ మే 17న ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరుకావాలని విభవ్ కుమార్‌ను ఆదేశించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్‌పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ మరణించాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇండోనేషియాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 4 చేతులు, 3 కాళ్లు, ఒక జననాంగంతో అవిభక్త కవలలు జన్మించారు. ఇండోనేషియాలో ఆ సోదరులు పుట్టినట్లు అమెరికా జర్నల్ వెల్లడించింది.
పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది.
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది.
పెట్రోల్ పంప్ వర్కర్‌పై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు అనాస్‌లను అరెస్ట్ చేసేందుకు నోయిడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా నోయిడా పోలీసులు అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకోగా.. అతను ఇంట్లో కనిపించలేదు.
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది.