Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…
- ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు
- భారత్ లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
- ఈ వ్యాధిబారిన పడిన వారిలో ఎక్కువ మంది ఎప్పుడూ పొగతాగని వారే ఉన్నట్లు అధ్యయనం వెల్లడి
- ఇండియాలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 28.2 సంవత్సరాలుగా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఎక్కువ మంది ఎప్పుడూ పొగతాగని వారే ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై ఓ అధ్యయనాన్నిసైన్స్ జర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురించారు. ఇప్పుడు పొగతాగని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తోందని దాంట్లో తెలిపారు.
READ MORE: BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్‌షా..
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
లాన్సెట్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. 2020లో ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 18 లక్షల మంది మరణించారు. భారత్ లో 2020లో 72,510 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సంవత్సరం 66,279 మంది రోగులు మరణించారు. 2020లో భారతదేశంలో సంభవించిన క్యాన్సర్ మరణాలలో 7.8% ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించాయి.
READ MORE: Venky Anil3: యానిమల్ నటుడిని దింపుతున్న రావిపూడి
భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణలో సగటు వయస్సు పాశ్చాత్య దేశాలలో కంటే 10 సంవత్సరాలు తక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సగటు వయస్సు 28.2 సంవత్సరాలగా వెల్లడించింది. అయితే.. దీనికి ఒక కారణం భారతదేశంలోని యువ జనాభా కూడా కావచ్చు. పాశ్చాత్య దేశాలలో, ఊపిరితిత్తుల క్యాన్సర్ 54 నుంచి 70 సంవత్సరాల మధ్య నిర్ధారణ చేయబడుతుంది. అయితే.. అమెరికాలో ఈ క్యాన్సర్ బారిన పడ్డ రోగుల సగటు వయస్సు 38 సంవత్సరాలు కాగా.. చైనాలో 39 సంవత్సరాలగా అధ్యయనం పేర్కొంది. 1990లో.. భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటు 6.62 ఉండగా.. అది 2019లో 7.7కి పెరిగింది. 1990 నుంచి 2019 మధ్యకాలంలో.. ఇది పురుషులలో 10.36 నుంచి 11.16కి .. స్త్రీలలో 2.68 నుంచి 4.49కి పెరిగింది.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!