ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది.
భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. నాజీ సర్కారు తీసుకొచ్చేందుకు బైడెన్ కూడా చంపాలనుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అతడు గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కు తో దాడి చేసిన ఘటన తెలిసిందే.
ఖలిస్థాన్ కు మద్దతుగా మరోసారి నినాదాలు రాసిన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల క్రింద ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వ్యక్తులు వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్‌లు క్రియేట్ చేస్తున్నారు.
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.
ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ కి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ.. తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడదన్నారు.