రిలయాన్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరగనుంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహంలో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పెళ్లిలో విలాసంతో పాటు భోజనంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వివాహ మెనులో అనేక వంటకాలు ఉండనున్నాయి. ఇందులో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన చాట్ కూడా ఉంది. అనంత్ అంబానీ పెళ్లిలో యూపీలోని ఓ ప్రముఖ షాప్ నుంచి చాట్ వడ్డించనున్నట్లు సమాచారం.
READ MORE: Raj Tarun Case: పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు
కాగా.. ఇటీవల నీతా అంబానీ పెళ్లి పత్రిక తీసుకొని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లివచ్చారు. అక్కడ కాశీ ఛాట్ భండార్లో రుచులు ఆస్వాదించారు. అవి నచ్చడంతో, ప్రత్యేకంగా ఆ కౌంటర్ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ ఛాట్, టమాట ఛాట్, పాలక్ ఛాట్, కుల్ఫీ ఇక్కడ ప్రత్యేకతలు. కాశీ చాట్ భండార్ యజమాని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నీతా అంబానీ ఇక్కడకు వచ్చి నాలుగు రకాల ఛాట్ లను తిన్నారు. ఆమె వాటిని చాలా ఇష్టపడ్డారు. పెళ్లిలో స్టాల్ పెట్టమని ఆహ్వానించారు. మా ఊరి టీమ్ పెళ్లికి వెళ్తోంది. అతను ఇక్కడ టిక్కీ చాట్, టొమాటో చాట్, పాలక్ చాట్, కుల్ఫీ మొదలైన ఐదు వస్తువులను తిన్నారు. నీతా అంబానీ ఇక్కడికి రావడం వల్ల తన ఆదాయం గణనీయంగా పెరిగింది.” అని పేర్కొన్నారు.