రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియమించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు.
న్యాయ విద్యలో చేరేందుకు ప్రయత్నిస్తు్న్న అభ్యర్థులకు తెలంగాణ లాసెట్ అధికారులు శుభవార్త తెలిపారు. తెలంగాణ లా సెట్ (TS LAWCET 2024) అప్లికేషన్ గడువు ఏప్రిల్ 15తో ముగియడ నుండగా.. అధికారులు గడువును పెంచారు. ఏప్రిల్ 25వ తేదీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువు సైతం అయిపోవడంతో మరోసారి గడువు పెంచుతూ.. లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ప్రకనట విడుదల చేశారు.
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు.
ప్రస్తుతం టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ సంస్థను బలోపేతం చేసేందుకు సంస్థ ప్రతినిధులు కష్ట పడుతున్నారు. దేశంలో జియో, ఎయిర్ టెల్ లతో వీఐకి గట్టి పోటీ ఉంటుందని.. వాటి ద్వారా తమ సంస్థ చాలా మంది వినియోగదారులను కోల్పోయిందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు.
రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
ఐపీఎల్ అంటేనే దూకుడు. బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనను చూపించేందుకు, వారి సత్తాను నిరుపించుకునేందుకు ఐపీఎల్ ఓ మంచి వేదికగా మారింది. బ్యాటర్లే కాకుండా బౌలర్లు కూడా కీలక సమయంలో మ్యాచ్ కు ప్రాణం పోస్తుంటారు.
శంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.