వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
“మన రోడ్లను నిర్మించింది మన సంపద కాదు... మన సంపదను నిర్మించింది మన రోడ్లు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్నారు. ఒక దేశాభివృద్ధిలో రహదారుల ఎంత కీలకమో ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ ఏడాది క్రితం కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మండలాల నుంచి జిల్లాలను కలిపే రహదారులు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానిని కలిపే రాష్ట్ర రహదారులు, వివిధ జిల్లాల మీదుగా ప్రయాణించే జాతీయ రహదారుల నిర్మాణంలో జోరు కనిపిస్తోంది. ఏడాది…
రవాణా శాఖ నూతన లోగోను, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలకు సీఎం హాజరయ్యారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా." అని పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా అధికార మార్పిడిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జీనోమ్ వ్యాలీలో రూ. 2వేల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని.. మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేయబోతున్నట్లు తెలిపారు. MSME పాలసీని మరింత పటిష్టంగా తెచ్చామని.. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుందని వివరించారు.