గత కొన్ని సంవత్సరాలుగా.. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ తయారీదారు కేటీఎం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. గణనీయమైన మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. ఈ కంపెనీకి చెందిన కేటీఎం 250 డ్యూక్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 250cc బైక్స్‌లో ఒకటి.
ఓలా భారతదేశంలో తన మొదటి B2B ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ గిగ్, గిగ్+ అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.50 వేల లోపే. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా నిర్ణయించింది. ఈ ఈవీలను సరకుల రవాణా కోసం రూపొందించారు.
చైనీస్ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన బెస్ట్యూన్ బ్రాండ్ గత ఏడాది తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తల్లో నిలిచింది. దీనికి అసలు కారణం.. ఈ కారులో మంచి ఫీచర్లతో పాటు.. చాలా తక్కువ ధరకు లభిస్తుంది. వాస్తవానికి, కంపెనీ బ్యాటరీకి సంబంధించిన సాంకేతికతను సృష్టించింది. ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. రేంజ్ కూడా అధికంగా ఉంది. ఈ టెక్నాలజీతో కంపెనీ షియోమీని లాంచ్ చేసింది.
పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వేలాది మంది రైతులు ఇవాళ ఢిల్లీకి పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైతులు నోయిడాలో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ 5000 మంది సైనికులను మోహరించారు. రైతుల పాదయాత్రతో నోయిడాలో చాలా చోట్ల జామ్ ఏర్పడింది. మహామాయ ఫ్లైఓవర్ కింద రైతులు ఏకం అయ్యేందుకు ప్లాన్ చేశారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ నిఘా కొనసాగిస్తున్నారు. పలు మార్గాలను దారి మళ్లించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
రూ.52 కోట్ల విలువైన అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను వేలానికి పెట్టినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇంత ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ని కొనుగోలు చేసిన వ్యక్తి దానిని డెకరేషన్ కోసం ఎక్కడో ఉపయోగించారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే దాన్ని కొన్న వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ వ్యాపారి జస్టిన్ సన్ ఈ కళాకృతిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్‌ను కాపాడుతుంది.
పశ్చిమాఫ్రికాలోని గినియాలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అభిమానులు తమలో తాము ఘర్షణ పడ్డారు. ఇందులో 100 మందికి పైగా మరణించారు. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరె నగరంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం లేచి చూసే సరికి డబ్బులు మాయమయ్యాయని…