IND vs PAK: తొలి ఓవర్‌తో షమీ పేరిట చెత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్తాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్ తరఫున బాబర్ అజామ్, ఇమామ్ ఉల్ హక్ మొదట బ్యాటింగ్ కు దిగారు. తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ 5 వైడ్లు వేశాడు. టీం ఇండియా ఇప్పుడు వికెట్ల కోసం చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో షమీ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో తొలి ఓవర్ పూర్తి పూర్తి చేసేందుకు అత్యధిక బాల్స్ వేసిన బౌలర్‌గా షమీ చెత్త రికార్డు సృష్టించాడు. తొలి ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ కూడా 11 బంతులే తీసుకున్నారు. వారితో సమానంగా షమీ నిలిచాడు. కాగా.. ఓవర్ వేస్తుండగా మోకాలి విషయంలో ఇబ్బంది పడ్డ షమీ డగౌట్‌కి చేరాడు. వాషింగ్టన్ సుందర్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. తొమ్మిదో ఓవర్‌లో భారత్‌కు వికెట్ దక్కింది. పాండ్య.. బాబర్‌ను బోల్తా కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. పదో ఓవర్‌లో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లో షమీ తిరిగి గ్రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.. ప్రస్తుతం 11 ఓవర్లకు పాక్ స్కోరు: 55-2 గా ఉంది.
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
భారత ప్లేయింగ్ ఎలెవన్- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
పాకిస్తాన్ ప్లేయింగ్ XI- మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ వికెట్ కీపర్), ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, సల్మాన్ అఘా, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!