Dhurandhar 2: అసలైన ‘ధురందర్’ రణవీర్ కాదు.. సినిమాలో ఊహించని మలుపు.. అభిమానులు షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: మల్టీ-స్టారర్ చిత్రం ‘ధురందర్-2’ ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ‘ధురంధర్: ది రివేంజ్’ చిత్రంలో కరాచీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలి పాత్రలో సీనియర్ నటుడు రాకేష్ బేడీ నటించారు. మొదటి భాగంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన, ఇప్పుడు ‘ధురందర్ 2’తో మరింత సంచలనం సృష్టించారు. తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపారు. ఈ చిత్రానికి అసలైన ‘ధురందర్’ రాకేష్ బేడీనే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాకేష్ బేడీ పాత్ర ఈ రెండో భాగంలో అనూహ్యంగా మారింది. ఈ పాత్ర వైబ్‌ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన పండించిన హ్యూమర్ (హాస్యం) క్యారెక్టర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ఎక్స్ట్రార్డినరీ నటనను చూసిన నెటిజన్లు “సినిమాకు అసలైన హీరో రాకేష్ బేడీనే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Ravichandran Ashwin: “బుమ్రా తర్వాత భారత్ పరిస్థితి ఏంటి?” టీమిండియాకు అశ్విన్ బిగ్ వార్నింగ్..
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
అభిమానులేకాదు.. బాలీవుడ్ స్టార్ రణవీర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఆసక్తికరంగా మారింది. ఒక పాడ్‌కాస్ట్‌లో రాకేష్ మాట్లాడుతూ.. తన షూటింగ్ చివరి రోజున రణవీర్ మైక్ తీసుకుని, “ఒకవేళ ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే, అందులో 500 కోట్లు కేవలం రాకేష్ జీ వల్లే వస్తాయి” అని రణవీర్ ప్రకటించాడట. రణవీర్ లాంటి స్టార్ హీరో నుంచి అంతటి ప్రశంస దక్కడం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు దక్కే అతిపెద్ద గౌరవంగా భావిస్తూ ఆయన ఉప్పొంగిపోయారు. మరోవైపు.. డైరెక్టర్ ఆదిత్య ధర్ సైతం రాకేష్ బేడీ నటనకు మంత్ర ముగ్దులైపోయారు. షూటింగ్ చివరి రోజున రాకేష్ భుజంపై చేయి వేసి, “సార్, మీ షూటింగ్ అయిపోతుందంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి, మిమ్మల్ని చాలా మిస్ అవుతాను” అని భావోద్వేగానికి గురయ్యారట. సెట్‌లో అంతటి సానుకూల వాతావరణం ఉంది కాబట్టే సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందని రాకేష్ బేడీ ధీమా వ్యక్తం చేశారు.
READ MORE: CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!
ఇక రాకేష్ బేడీ (Rakesh Bedi) విషయానికి వస్తే.. భారతీయ సినీ, రంగస్థల, టెలివిజన్ రంగాల్లో సుపరిచితుడైన ఒక ప్రముఖ నటుడు. ముఖ్యంగా తన అద్భుతమైన హాస్య నటనకు (Comic timing) ఎంతో ప్రసిద్ధి చెందారు. 1979లో ‘హమారే తుమ్హారే’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ‘చష్మే బుద్దూర్’ (1981), ‘ఏక్ దూజే కేలియే’ (1981), ‘గదర్’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక టీవీ సీరియల్స్‌లో పోషించిన పాత్రలు ఇంటింటికీ చేరువయ్యాయి. ‘యే జో హై జిందగీ’, ‘శ్రీమాన్ శ్రీమతి’, ‘యెస్ బాస్’ వంటి పాత సీరియల్స్‌తో పాటు, ప్రస్తుతం ‘భాభీజీ ఘర్ పర్ హైన్’, ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ వంటి పాపులర్ షోలలోనూ నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!