సీఎంలు అనుకూలంగా మాట్లాడే టీచర్లు ఎమ్మెల్సీలు అయ్యారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. తెలంగాణలో పాత పీఆర్సీ దిక్కులేదని చెప్పారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రెండు మూడు ఏళ్లు గడిచిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు. దానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు. దానికి కారణంగానే పీఆర్సీ లేదని.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవన్నారు. రెండు ఒకే తాడు ముక్కలని.. నాడు కేసీఆర్ ఏది చేశారో నేడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టారని.. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి దోచిపెడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో కంపెనీలు, ఆస్పత్రిలో దెబ్బతిన్నాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందర్నీ బెదిరించి వసూలు చేస్తున్నారన్నారు. అపార్ట్మెంట్లు కడితే పోర్షన్లు అడుగుతున్నారని.. దౌర్జన్యము, గూండాయిజం, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని ఆరోపించారు.
READ MORE: Vishvambhara : విశ్వంభర సినిమాలో ఆ పాటకు థియేటర్లలో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం
రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలకు ఏ విధంగా ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుంటారో అడిగితే ఈరోజు వరకు జవాబు లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ గుర్తు చేయి కదా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారరి.. అధికారం కోసం ఏమైనా మాట్లాడతారని విమర్శించారు.. ఓట్లు వస్తే చాలు నేను ముఖ్యమంత్రి అయితే చాలు అనే విధంగా వ్యవహరించారని..హైదరాబాదులో రాహుల్ గాంధీ ట్యాక్స్ చేసి ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాద కార్యక్రమాలు, కరెంటు కోతలు లేవని చెప్పారు. దోపిడీ మాయమైందని.. మోడీ 10 ఏళ్లలో ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు రాలేదని వెల్లడించారు. సమర్థవంతంగా, నీతివంతంగా పనిచేస్తున్నారన్నారు. అమెరికాలో ఏ విధంగా రోడ్లు ఉంటాయో అద్భుతమైన జాతీయ రహదారులు దేశంలో వచ్చాయని తెలిపారు.
READ MORE: Seethakka: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి.. అధికారులకు మంత్రి ఆదేశం