ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తన ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడిందనే కారణంతో ఓ భర్త తన భార్యను, అత్తను హత్య చేశాడు. ఆదివారం రాత్రి భర్త ఇంటికి రాగా, భార్య ప్రేమికుడితో మాట్లాడుతూ కనిపించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ దాకా వెళ్లింది. ఇంతలో భార్య తల్లి అడ్డుకోవడంతో ఆగ్రహించిన భర్త పదునైన ఆయుధంతో ఇద్దరినీ నరికి చంపాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లు అధికమయ్యాయి. చొరబాట్లను మెరుగ్గా నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం (BSF) చర్యలు ప్రారంభించింది. ఇటీవల పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి జమ్మూ ప్రాంతంలో 2,000 మంది సిబ్బందితో కూడిన రెండు కొత్త బెటాలియన్లను మోహరించింది. ఈ బెటాలియన్ల సైనికులు పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ విస్తరణ పాయింట్ వెనుక 'సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్'గా మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బెటాలియన్లు ఇటీవల ఒడిశాలోని యాంటీ నక్సల్ ఆపరేషన్ ప్రాంతం నుంచి వచ్చాయి.
టీమిండియాలో ఉన్న క్రికెటర్స్ అందరితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్కి అత్యంత ప్రాధాన్యమిస్తారు. అతడు చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటాం. విరాట్ డైట్ చాలా ప్రత్యేకమని చెబుతుంటారు. ఆ డైట్ కేవలం ఆహారానికే వర్తించదు.. విరాట్ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం.
ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి.
మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి. మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలు మరీ డేంజర్. ఎందుకంటే..
మహారాష్ట్రలోని లాతూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. జుట్టు రాలడం, చుండ్రు, దురద, జుట్టు పల్చబడడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. శీతాకాలంలో తగ్గుతున్న ఊష్ణోగ్రతల కారణంగా.. వేడి నీటితో తల స్నానం చేస్తుంటారు. అలా చేస్తే జుట్టుకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
స్కాట్లాండ్లోని చారిత్రక లైట్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు.