పెళ్లయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ గొడవలు పెద్ద వివాదంగా మారుతాయి. యూపీలోని ఘాజీపూర్ జిల్లా నుంచి ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన పుట్టింటికి వెళ్లింది. ఇదంతా కామన్ అనుకున్న భర్త లైట్ చేసుకున్నాడు. కానీ.. భార్య తండ్రి ఫోన్ చేసిన ఓ విషయం చెప్పాడు. అది విన్న భర్త పోలీస్ స్టేషన్‌కి పరుగులు తీశాడు. తన భార్యను కనుగొని తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇంతకీ ఏమైందంటే?
READ MORE: SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి..
ఈ సంఘటన సైద్‌పూర్ కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఘాజీపూర్ నివాసి సంతోష్.. సైద్పూర్ కొత్వాలిలోని పర్మన్న చక్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. సంతోష్ భార్యకు ఎవరితోనో సంబంధం ఉంది. ఆమె తన ప్రేమికుడిని రహస్యంగా కలిసేది. ఈ విషయం సంతోష్‌కి తెలిసింది. తన భార్యకు పలు మార్లు ఈ అంశాన్ని వివరించాడు. కానీ ఆమె వినలేదు. తన ప్రేమికుడిని కలవడం కొనసాగించింది. వారి ప్రేమ ఎంతగా పెరిగిందంటే.. ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు.
READ MORE: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరతాం..
ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఆమె భర్త సంతోష్‌తో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. ఆమె కోపంగా ఉందని సంతోష్ భావించాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తులే అనుకున్నాడు. ఓ రోజు తన మామ సంతోష్‌కి ఫోన్ చేశాడు. తన కూతురు రోషన్ అనే యువకుడితో పారిపోయిందని మామ సంతోష్‌కి ఫోన్‌లో చెప్పాడు. ఇప్పటికే వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితుడు పోలీసులకు మొత్తం విషయం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.