జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని చకులియా పోలీస్ స్టేషన్ పరిధి జోడ్సా గ్రామంలో మేకను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
READ MORE: Anna Hazare: మద్యం దుకాణాలతో కేజ్రీవాల్ దారి తప్పారు..
అసలేం జరిగిందంటే.
చకులియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడ్సా గ్రామానికి చెందిన హరగోవింద్ నాయక్ ఇంటికి మేకలను దొంగిలించడానికి ఇద్దరు యువకులు వచ్చారు. దొంగిలించేందుకు యత్నిస్తుండగా.. మేక మెడలో కట్టిన గంట మోగింది. వెంటనే హరగోవింద్ నాయక్ మేల్కొన్నాడు. బయటకు వచ్చేసరికి ఇద్దరు యువకులు బైక్ పై మేకను తీసుకెళ్తున్నట్లు చూశాడు. ఆ ఇద్దరు దొంగలను వెంబడించి పట్టుకున్నాడు. ముగ్గురి మధ్య ఘర్షణ మొదలైంది. ఇది విన్న గ్రామస్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలను కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బలకు 30 ఏళ్ల కిషుక్ బెహెరా అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడు భోలానాథ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతులనుని చకులియాలోని జిరాపాడ నివాసులుగా గుర్తించారు.
READ MORE: CM Revanth Reddy: పార్టీ నేతలకు సీఎం క్లాస్.. నేను చేసేది చేసినా ఇక మీ ఇష్టం
ఈ విషయంలో రూరల్ ఎస్పీ రిషబ్ గార్గ్ మాట్లాడుతూ.. ” మేకను దొంగిలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత గ్రామంలోని వ్యక్తులు వారిని కొట్టారు. ఈ క్రమంలో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిని అరెస్టు చేయడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.” అని వెల్లడించారు.