ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆరంభించింది. భారత జట్టు 47 పరుగుల వ్యవధిలో పాకిస్తాన్ పై 2 వికెట్లు పడగొట్టింది. కానీ పాకిస్తాన్ కూడా ఓటమిని తేలికగా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43.2 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ స్కోరు: 201/7
IND vs PAK:షమి వేసిన 49 ఓవర్‌లో చివరి బంతికి రెండో పరుగు కోసం యత్నించి రవూఫ్ రనౌటయ్యాడు. 49 ఓవర్లకు స్కోరు 241/9.
దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌ను తిలకిస్తున్న సినీ నటుడు, పద్వవిభూషన్ చిరంజీవి..
IND vs PAK: కుల్దీప్ యాదవ్ వేసిన 46.4 ఓవర్‌కు నసీమ్ షా (14) ఔటయ్యాడు. నసీమ్ షా.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 47 ఓవర్లకు స్కోరు 222/8.
IND vs PAK: 47 ఓవర్లో నసీమ్ షా పెవిలియన్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టాడు.
IND vs PAK: షమీ వేసిన 46 ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి.
IND vs PAK: హర్షిత్ రానా 44వ ఓవర్ వేశాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 45వ ఓవర్‌లో మరో ఆరు యాడ్ అయ్యియి.
IND vs PAK: కుల్దీప్ యాదవ్ వేసిన 43వ ఓవర్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 42.5 బాల్ వద్ద షాహీన్ అఫ్రిది అయ్యాడు. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు వికెట్లు కోల్పోయింది.
IND vs PAK: పాకిస్థాన్ స్కోరు 43వ ఓవర్‌లో 200లకు చేరుకుంది.
IND vs PAK: భారత్ ఖాతాలో ఆరో వికెట్.. కుల్దీప్ వేసిన 43వ ఓవర్‌లో సల్మాన్ ఆఘా (19) క్యాచ్ అవుట్ అయ్యాడు.
IND vs PAK: 42 వ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను అక్షర్ పటేల్ పూర్తి చేశాడు. 42 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 197-5
IND vs PAK: కుల్దీప్ యాదవ్ 41 వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో మొత్తం ఐదు రన్స్ వచ్చాయి. ప్రస్తుతం పాక్ స్కోరు : 188-5
𝘽𝙐𝙇𝙇𝙎𝙀𝙔𝙀! 🎯💥
Axar Patel with a stunning direct hit and Imam-ul-Haq is caught short! A moment of brilliance in the #GreatestRivalry—can Pakistan recover from this setback? 👀🔥#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳 🆚 🇵🇰 | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/vkrBMgrxTi
— Star Sports (@StarSportsIndia) February 23, 2025
IND vs PAK: పాకిస్థాన్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్లలో16 పరుగులు తీశారు. 40 ఓవర్లకు స్కోరు 183/5కు చేరుకుంది.
దుబాయ్‌లో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏపీ మంత్రినారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్ వీక్షిస్తున్నారు.
IND vs PAK: జడేజా 39వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో పాకిస్థాన్ ఏడు పరుగులు సాధించింది. ప్రస్తుతం పాక్ స్కోరు : 177-5
IND vs PAK: భారత బౌలర్లు అద్దరగొడుతున్నారు. 38వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 38 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ స్కోరు: 170-5
IND vs PAK: భారత బౌలర్లు రెచ్చి పోతున్నారు. తక్కువ కాల వ్యవధిలో మూడు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా వేసిన 36.1 ఓవర్‌కు తయ్యబ్ తాహిర్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 165 పరుగుల వద్ద పాక్ ఐదో వికెట్ కోల్పోయింది.
IND vs PAK: 37వ ఓవర్‌లో పాకిస్థాన్ 5వ వికెట్ కోల్పోయింది. జడేజా తయ్యబ్ తాహిర్‌ను ఔట్ చేశాడు..
IND vs PAK: 76 బంతుల్లో 62 పరుగులు చేసిన పెవిలియన్‌కు చేరుకున్నాడు సౌద్ షకీల్. హార్దిక్ వేసిన 34.5 ఓవర్‌కు అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు.35 ఓవర్లకు స్కోరు 160/4.
IND vs PAK: నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్ .. 62 పరుగులు చేసిన పెవిలియన్‌కు చేరుకున్న సౌద్ షకీల్.
ఛాంపియన్స్ ట్రోఫీ: మూడో వికెట్ కోల్పోయిన పాక్. 151 పరుగుల వద్ద రిజ్వాన్ (46) ఔట్.
IND vs PAK: 34వ ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ (46) ఔటయ్యాడు. రిజ్వాన్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకోలేక పోయాడు. రిజ్వాన్ 77 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. రిజ్వాన్ పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 33.2 ఓవర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షకీల్, రిజ్వాన్ భాగస్వామ్యంలో 104 పరుగులు సాధించారు. 34 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 154-3
IND vs PAK: 34వ ఓవర్లో అక్షర్ అద్దరగొట్టాడు. పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. రిజ్వాన్ ను అక్షర్ ఔట్ చేశాడు.
IND vs PAK: 33వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ వైడ్ చేశాడు. సౌద్ షకీల్ తలపైకి బౌన్స్ అయింది. ఈ ఓవర్‌లో మొత్తం ఎనిమిది పరుగులు వచ్చాయి. 33 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 150-2
IND vs PAK: జడేజా వేసిన 31 ఓవర్లో 8 రన్స్ వచ్చాయి. షకీల్ హాఫ్ సెంచరీ (63 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.
IND vs PAK: 31 ఓవర్ పూర్తి చేసిన అక్షర్ పటేల్. 5 పరుగులు ఇచ్చాడు. 32 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 142-2
IND vs PAK: రవీంద్ర జడేజా 31 ఓవర్ పూర్తి చేశాడు. ఈ ఓవర్లో రెండవ బంతికి ఫోర్ ఇచ్చాడు. మొత్తం 11 రన్స్ వచ్చాయి. 31 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 137-2
IND vs PAK: అక్షర్ పటేల్ 30 ఓవర్ వేశాడు.. తన ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 30 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 129-2
IND vs PAK: జడేజా 29 ఓవర్ పూర్తి చేశాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.29 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 126-2
IND vs PAK: 28 ఓవర్లో షమీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఐదు పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 121-2
IND vs PAK: 27వ ఓవర్ పూర్తి చేసిన జడేజా.. 9 పరుగులు ఇచ్చాడు. 27 ఓవర్ల పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 116-2
IND vs PAK: కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. 26 ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో పాకిస్థాన్ ఎనిమిది రన్లు సాధించింది. ప్రస్తుతం పాక్ స్కోరు: 107-2
IND vs PAK:23వ ఓవర్లో నాలుగు రన్లు ఇచ్చిన జడేజా... 25 ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు ఇచ్చాడు. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు.
IND vs PAK: కుల్దీప్ యాదవ్ 24 ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం పాక్ స్కోరు : 94/2
IND vs PAK: జడేజా రంగంలోకి దిగాడు.. 23వ ఓవర్ పూర్తి చేశాడు. నాలుగవ బంతికి 3, చివరి బాల్‌కి 1 రన్ వచ్చింది. 23 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 90/2
IND vs PAK: కుల్దీప్ యాదవ్ 22 ఓవర్ వేశాడు.. ఈ ఓవర్లో పాక్ నాలుగు పరుగులు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 86/2
IND vs PAK: 21 ఓవర్ పూర్తి చేసిన హర్షిత్ రాణా.. మూడు పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 82/2కు చేరుకుంది.
IND vs PAK: హర్షిత్ రాణా వేసిన 19 ఓవర్‌లో మూడు, కుల్దీప్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 20 ఓవర్లకు స్కోరు 79/2. రిజ్వాన్ (13), షకీల్ (20) పరుగులతో ఉన్నారు.
IND vs PAK:18 వ ఓవర్ లో అక్షర్ పటేల్ రీ- ఎంట్రీ ఇచ్చాడు. గత 16 ఓవర్ అక్షర్ వేయగా.. 7 పరుగులు వచ్చాయి. కానీ.. 18 వ ఓవర్ లో మాత్రం కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. 18 ఓవర్ల పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 74/2
IND vs PAK: 17వ ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు. ఈ ఓవర్లో పాక్ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించింది. 17 ఓవర్ల పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 72/2 (17)
IND vs PAK: 16వ ఓవర్లో అక్షర్ తిరిగి దాడికి దిగాడు.. ఈ ఓవర్లో పాక్ ఏడు పరుగులు సాధించింది. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 70-2
IND vs PAK: 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేశాడు. పవర్‌ప్లే ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. కాగా..15 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 63-2
IND vs PAK: 14 ఓవర్ షమీ వేశాడు. నాలుగు ఓవర్లుగా పాకిస్థాన్ ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. 14 ఓవర్లకు పాక్ స్కోరు: 61/2
IND vs PAK: హార్దిక్ పాండ్య 13 ఓవర్ వేశాడు. 13 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 59-2
IND vs PAK: గుడ్‌న్యూస్.. 12 ఓవర్లో షమీ తిరిగి గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు.. ఈ ఓవర్‌లో మూడు పరుగులే వచ్చాయి. 12 ఓవర్లకు పాక్ స్కోరు: 58/2
IND vs PAK: హార్దిక్ పాండ్య 11వ ఓవర్ వేశాడు..11 ఓవర్ల తర్వాత పాక్ స్కోరు: 55-2
పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వికెట్ సాధించాడు. అక్షర్ సూపర్ త్రో .. ఇమాన్ రనౌట్ అయ్యాడు. పదో ఓవర్ ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు: 52-2
భారత్ ఖాతాలో రెండో వికెట్ అక్షర్ సూపర్ త్రో .. ఇమాన్ రనౌట్10 (26)
IND vs PAK: కుల్దీప్ చేతిలో పెవిలియన్‌కు చేరిన ఇమాన్.. ఇమాన్ రనౌట్.
9 వ ఓవర్ హార్దిక్ పాండ్య పూర్తి చేశాడు. తన ఓవర్ రెండో బంతికి బాబర్ అజామ్‌ను హర్దిక్ ఔట్ చేశాడు. దీంతో పాకిస్థాన్‌కి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోరు: 47-1