ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సారి కూడా రేపో రేటులో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని ఆయన వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించనున్నారు. ఎంపీసీ గత 10 సమావేశాల్లో కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. 11వ సమావేశంలో కూడా 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. దీని గురించి తెలుసుకుందాం..
కలియుగంలో ఏదైనా జరగవచ్చని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ మధ్య వస్తున్న వార్తలను బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. దేశంలో మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు అనేక పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇలాంటి కథే గుజరాత్‌లోని సూరత్ నుంచి వెలుగులోకి వచ్చింది. నకిలీ వైద్య పట్టాలను విక్రయిస్తున్న రాకెట్‌ను సూరత్ పోలీసులు గురువారం ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఇందులో సూత్రధారులు.. నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా వైద్యులుగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు.
రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు మొదట టాటా పంచ్ కారును ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బీఎండబ్ల్యూ కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. టాటా పంచ్ కారు స్వల్పంగా దెబ్బతింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. ఈ బుధవారం హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్‌గఢ్ పోలీస్స్టేషన్ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్రామ్ అవలం, సుకాలు ఫర్సాలను అనుమానిత మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ 'శబరిమల - పోలీస్ గైడ్' పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్…
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం…
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు.
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాం.
డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు […]