పిల్లల్తో హోమ్ వర్క్ చేయించడం, పరీక్షలకు ప్రిపేర్ చేయించడం పేరెంట్స్‌కు పెద్ద టాస్క్. ఎందుకంటే వారిని పట్టుమని పది నిమిషాలైన కదురుగా కూర్చోబెట్టలేం. అటు ఇటు పరుగెత్తడం, కదలడం వంటివి చేస్తుంటారు. దీనికి కారణం పెద్దల కంటే పిల్లల్లో తక్కువ శ్రద్ధ ఉండటమే. పిల్లల గరిష్ట శ్రద్ధ వారి వయస్సు కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. చదువుపై శ్రద్ధ పెట్టేందుకు, పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఇస్లామిక్ దేశం సిరియాలో అధికారం కోసం మళ్లీ హింస చెలరేగింది. ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) గత వారం అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, సైన్యంపై దాడి చేసింది. గురువారం హమా నగరాన్ని ఆక్రమించిన హెచ్‌టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు శుక్రవారం మరో కీలక నగరం హోమ్స్ దిశగా సాగుతున్నాయి. దీని తరువాత.. సిరియాలో ఉద్రిక్తత పెరిగింది. హిట్ఎస్ దాడి కారణంగా.. ప్రభుత్వ సైన్యం కూడా వెనక్కి తగ్గింది. ఈ దాడి తర్వాత దాదాపు 14 ఏళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధ పరిస్థితులు తారుమారయ్యాయి.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
ఈ నెలతో 2024 ముగిసి పోయి.. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ కార్లు, బైక్‌ల ధరలను పెంచబోతున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2025 నుంచి కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరగవచ్చని మారుతీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కార్ మోడల్లను బట్టి మారుతి కార్ల ధరలో పెరుగుదల మారవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తెలిపారు. రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో.. ఖర్గే మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
'చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..' అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. మరోవైపు.. ‘అమ్మ చీరనే కట్టే పాప జ్ఞాపకం..’ అనేది ఎంత అందమైన భావనో కదా!. కానీ.. ప్రస్తుత సమ పరిస్థితులు చూస్తుంటే.. "ఒకప్పుడు మా అవ్వలు చీరలు కట్టుకునే వారట" అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో…
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. టాటా మోటార్స్ ఇప్పుడు భారతీయ ఆటో పరిశ్రమలో తన ప్రసిద్ధ కారు టాటా నానోను మళ్లీ ప్రారంభించాలని యోచిస్తోంది! అయితే ఈసారి ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో ఉంటుందని సమాచారం. టాటా నానో ఈ కొత్త వెర్షన్ 2025 నాటికి ప్రారంభించబడవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య బేసిక్ ధరతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నట్లు సమాచారం.