Natasa Stankovic New Car: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం నటాషా స్టాంకోవిచ్ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి గ్లామర్ ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచ్‌లకు తరచూ హాజరయ్యే నటాషా.. ఒంటరితనాన్ని ఎంచుకుట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన జీవితం వైపు తిరిగి అడుగులు వేస్తోంది. తనపై వస్తున్న వార్తలకు పెద్దగా స్పందించని నటాషా.. ఇప్పుడు వ్యక్తిగతంగా, ఆర్థికంగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడు అగస్త్యను చూసుకుంటూనే, తన కెరీర్ మీద కూడా దృష్టి పెడుతోంది.…
Tandur Accident: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.. కూతురు పెళ్లి పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందారు. యలల్ మండలం సగెంకుర్దులో ఘటన చోటు చేసుకుంది. సగెంకుర్దుకి చెందిన అనంతప్ప తన కుమార్తె వివాహం పెట్టుకున్నారు. కూతురు పెళ్లి పనుల నిమిత్తం యాలాల్ మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.
Bharath bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కి నిరసనగా నేడు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చెప్పారని ఆరోపించారు.
YS Jagan-KTR: సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలేకు మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట సమీపంలో NH 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపి ఉండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢికొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ, నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్‌లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా నిర్మించడం లేదన్నారు. క్వాలిటీకి ఎక్కడ కొరతలేదని…
India-Paksitan War: చైనా వక్ర బుద్ధి మరోసారి బట్టబయలైంది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ ఘర్షణను చైనా కొత్త సైనిక హార్డ్‌వేర్‌ను పరీక్షించడానికి ఉపయోగించుకుంది. ఈ సమాచారాన్ని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. ఇరు దేశా మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణను బీజింగ్ ప్రత్యక్ష పరీక్షా కేంద్రంగా ఉపయోగించుకుందని నివేదిక వెల్లడించింది. కొత్తగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పరిధి, మెరుగుదలను పరీక్షించడానికి చైనా ఉపయోగించుకుందని…
Election Commission: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా వారీ అబ్జర్వర్లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సమావేశంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈసీ చర్యలు అధికార యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తున్నాయి.
Coffee Topped With Powdered Cockroach: చైనా వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీటకాలు, పురుగులు, పాములు, పక్షులు, జంతువులు ఇలా వేటినీ వదలకుండా మింగేస్తుంటారు. అయితే.. తాజాగా చైనా రాజధాని నుంచి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌లోని ఒక కీటకాల నేపథ్య మ్యూజియం కాఫీని గమ్మత్తుగా తయారు చేసింది. కాఫీలో బొద్దింక పొడి, ఎండిన పురుగుల లార్వాల మిశ్రమం కలిపి అక్కడి జనాలకు నచ్చేలా అద్భుతంగా తయారు చేశారు. ఈ అసాధారణ చైనీస్ కాఫీని భారతీయులు మాత్రం తాగలేరు.