High Court: ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల.. హిందీ మహావిద్యాలయ అటానమస్ రిజిస్ట్రార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్ల నిమిత్తం అధికారిక వెబ్సైట్లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ కోర్టుకు హాజరై వివరాణ ఇవ్వాలని ఆదేశించింది.
iBomma Ravi: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు.. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు రెండో రోజు ఐ బొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. రవి సాంకేతిక…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టినప్పటి నుంచి నడుము కింద భాగంలో తోకలాంటిది పెరుగుతూ, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న ఏడాదిన్నర చిన్నారిని చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎక్కడా పరిష్కారం దొరకలేదు.
CPI Maoist Party: మారేడుమల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల తోపాటు మరికొంతమందిని తీసుకొని వెళ్లి హత్య చేసి ఎన్కౌంటర్ గా చిత్రీకరించారని లేఖలో పేర్కొన్నారు. అలాగే రంపచోడవరంలో ఏవోబి రాష్ట్ర కార్యదర్శి శంకర్ తో పాటు మరికొంతమందిని హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ 23వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపు నిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్లు అసువులు…
Zomato: ఫుడ్ డెలివరీ రంగంలో పెద్ద మార్పులు మొదలయ్యాయి. ఆన్లైన్ ఆర్డర్లు చేసే కస్టమర్లు, ఆ ఆర్డర్లు తయారు చేసే రెస్టారెంట్లు, వాటిని డెలివర్ చేసే యాప్‌లు ఇప్పటి వరకు ఒక్కోటి ఒక్కో విధంగా పనిచేస్తూ వచ్చాయి. కానీ ఇటీవలి నిర్ణయాలతో ఈ వ్యవస్థ మొత్తం కొత్త దిశలోకి వెళ్తోంది. ముఖ్యంగా జొమాటో కస్టమర్ల ఫోన్ నంబర్లు రెస్టారెంట్లతో పంచుకోవాలని ఒప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. రెస్టారెంట్లు చాలా ఏళ్లుగా తమకు కస్టమర్ల సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఎవరు తరచూ తమ…
DGP Shivadher Reddy: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ... గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం…
Meta Ray-Ban Smart Glasses: మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ నవంబర్ 21 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం మే నెలలో కంపెనీ ఈ గ్లాసులను భారతదేశంలో విడుదల చేసింది. ఎస్సిలోర్లక్సోటికాతో భాగస్వామ్యంతో మెటా ఈ గ్లాసులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌పై కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ ప్రారంభ ధర రూ.29,900. […]
Karnataka Congress in Turmoil: కర్ణాటకలో పవర్ పాలిటిక్స్‌లో పరేషాన్ నెలకొంది. కర్ణాటక ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా చీలారు. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ వర్గాల తలపోటుగా మారిన విషయం తెలిసిందే. హైకమాండ్ వైపే మేమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంది. 2023లో సిద్ధరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదట్లో అనుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌కు అప్పగించాలని కొంత మంది…
Piracy: పైరసీ సినిమాల అంశంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. SBI ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమవుతున్నట్లు తెలుస్తోంది! sbiterminsurance.com పేరుతో అందుబాటులో వెబ్ సైట్ ఉంది.. Term insurance laps and revival guide రీ-డైరెక్ట్ పేజీలో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతున్నాయి.. పైరసీ వెబ్ సైట్లు I Bomma పేరును వాడుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు iBommaగా పేరు మార్చి.. వాటిపై క్లిక్ చేస్తే తమ పేజీకి రీ-డైరెక్ట్ అయ్యేలా నకిలీగాళ్లు మార్చేశారు. తాజాగా iBomma plus ane website…
I BoMMA Ravi Case: ఐ బొమ్మ రవిపై పోలీసులు మరో మూడు సెక్షన్లు జోడించారు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. IT యాక్ట్ , BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్‌ను జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్సీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు. మరో వైపు రెండు రోజు రవి…