CRPF Strengthens Security at Telangana–Chhattisgarh Border: తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో భారీగా CRPF భద్రతా బలగాలు మోహరించారు. కర్రెగుట్టలను భద్రతాబలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద CRPF బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ఫీఎఫ్ 39 బెటాలియన్‌ను సీఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. "కర్రెగుట్టలపై అతితక్కువ కాలంలో పట్టు సాధించాం.. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చి దిద్దుతాం.. త్వరలో…
Muskan Saurabh Rajput Case: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిపెట్టిన ముస్కాన్ గుర్తుంది కదా.. ముస్కాన్ మరోసారి ముఖ్యాంశాలలో నిలిచింది. సౌరభ్ హత్యలో ప్రధాన నిందితురాలు ఎనిమిది నెలలుగా జైల్లో ఉంది.. తాజాగా ముస్కాన్ ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజీలో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ వార్త కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ నవజాత శిశువుకు తండ్రి ఎవరు? ఆమె…
Hyderabad: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి, దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవటంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడు ఎవరో కాదు.. ఆ ఇంటికి చాలా కాలంగా కాపలాకాస్తున్న వాచ్మెన్ అని తెలిసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..
Hyderabad: పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో శాలిబండ భారీ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది.. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి షోరూమ్ ముందు పార్క్ చేసిన కారు పల్టీలు కొట్టింది.. అద్దాలు పగలగొట్టి డ్రైవర్ బయటపడ్డాడు.. కాసేపటికే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.…
GHMC Corporators Meeting: నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ముగియనుండటంతో ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం కానుంది! 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్‌కి నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కౌన్సిల్ మీటింగ్ కోసం కార్పొరేటర్ల నుంచి అధికారులు ప్రశ్నలను స్వీకరించారు. గడిచిన ఐదేళ్లలో చేసిన పనులపై ఈ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. హెచ్ సిటీ పనులు,…
IAS officer: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో AJAX (మధ్యప్రదేశ్ షెడ్యూల్డ్ కులాలు, తెగల అధికారులు, ఉద్యోగుల సంఘం) ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రాంతీయ అధ్యక్షుడు, సీనియర్ IAS అధికారి సంతోష్ వర్మ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది.
Telangana Cabinet Meeting Today: తెలంగాణలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న క్యాబినెట్ సమావేశం కీలక చర్చలకు వేదిక కానుంది. ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అత్యవసర అంశాలను మంత్రి వర్గం విస్తృతంగా పరిశీలించనుంది. రాష్ట్రంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, నష్టాలు, అలాగే భారీగా పెరిగిన సింగరేణి బొగ్గు ధరల ప్రభావం వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాదులో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను వేగంగా విస్తరించడం,…
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ వివాదం మరోసారి వేడెక్కింది. హైకమాండ్ డీకే శివకుమార్‌ను 2.5 సంవత్సరాలు వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు సిద్ధరామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించలేకపోతుందనే వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పంద కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదటి రెండునరేళ్ల పదవీకాలం డిమాండ్ చేశారు.. కానీ సిద్ధరామయ్య…
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాల్‌దర్వాజ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ భవనం నిమిషాల్లోనే మంటలకు ఆహుతైంది. రెండు అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టు భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్జీ కారు కూడా మంటల్లో చిక్కుకుని పేలిపోవడంతో అగ్నికీలలు మరింత ఎగిసిపడ్డాయి. ఆ…
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. తన స్వగ్రామం రహత్ నగర్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఇచ్చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు పది ఎకరాలు, సబ్ స్టేషన్‌కు ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చారు. టెంపుల్ కారిడార్ ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మహేష్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు..