Commander Namansh Syal: దుబాయ్‌లో జరిగిన వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ సంఘటనపై భారత వైమానిక దళం విచారం వ్యక్తం చేసింది.. అమరుడైన వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ (34) గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వాన్ ప్రాంతం పాటియాలాకాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ అమరులయ్యారనే వార్తతో గ్రామం…
Begumpet: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా అసిస్టెంట్ పైలట్‌పై మరో పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం బాధితురాలు బేగంపేట్ పోలీసులు ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్‌లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బెంగళూరు వెళ్ళింది బాధితురాలు.. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని హోటల్లో మహిళా అసిస్టెంట్ పైలెట్‌తో […]
Maoists: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Hot Shower After Gym: ఇటీవల, 24 ఏళ్ల వ్యక్తి జిమ్ తర్వాత వేడి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ.. వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో ఓ…
UP: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన ఏడు రోజులకే. వరుడిని తన ప్రేమికుడితో కలిసి నవ వధువు హత్య చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. పరశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేదిపూర్ గ్రామంలో అనిస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అయోధ్య జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది.
New Labour Codes: మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలపై అతిపెద్ద అడుగు వేసింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్లను ప్రవేశపెట్టింది. నవంబర్ 21 నుంచి ఈ కొత్త కోడ్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు దేశ ఉపాధి, పారిశ్రామిక వ్యవస్థను పునర్నిర్వచించగలదు. ఇది 400 మిలియన్ల మంది కార్మికులకు సామాజిక భద్రతా కవరేజీని అందిస్తుంది. అంటే దేశంలోని సగానికి పైగా శ్రామిక శక్తిని మొదటిసారిగా రక్షణ గొడుగు కిందకు తీసుకువచ్చారు. దేశంలో అమలు చేయబడుతున్న…
Tejas Fighter Jet: దుబాయ్‌లో జరిగిన వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ సంఘటనపై భారత వైమానిక దళం విచారం వ్యక్తం చేసింది.. ప్రమాదానికి గల కారణాన్ని దర్యాప్తు చేయడానికి విచారణ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే.. తేజస్ విమానం గతంలోనూ కూలిపోయింది. 2024లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ తేజస్ ఎందుకు కూలిపోయిది..? దీనికి ప్రధాన కారణాలు ఏంటి..?…
High Court: ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల.. హిందీ మహావిద్యాలయ అటానమస్ రిజిస్ట్రార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్ల నిమిత్తం అధికారిక వెబ్సైట్లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ కోర్టుకు హాజరై వివరాణ ఇవ్వాలని ఆదేశించింది.
iBomma Ravi: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు.. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు రెండో రోజు ఐ బొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. రవి సాంకేతిక…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పుట్టినప్పటి నుంచి నడుము కింద భాగంలో తోకలాంటిది పెరుగుతూ, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న ఏడాదిన్నర చిన్నారిని చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎక్కడా పరిష్కారం దొరకలేదు.