Winter Bathing Myths: స్నానం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమన్న భావన అందరిలోనూ ఉంది. ఉదయం స్నానం చేస్తే శరీరం తేలికగా ఉంటుంది, మనసు ఫ్రెష్‌గా మారుతుంది. కానీ.. చలికాలం వచ్చేసరికి చాలా మందికి స్నానం చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. చల్లని గాలి, చల్లటి నీరు శరీరాన్ని వణికిస్తాయి కాబట్టి వేడి నీటిని ఆశ్రయిస్తారు. కానీ ఏ నీటితో స్నానం చేయడం, ఎక్కువసేపు నీటిలో ఉండడం వల్ల చర్మం సహజ రక్షణ పొర బలహీనం కావడం సహజం. ప్రత్యేకంగా శరీరాన్ని తరచూ కడుగుతూ ఉండటం వల్ల…
Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
Movierulz Continues Piracy: పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. అయినా.. movierulz పైరసీ సైట్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు ఒక్క రోజులోనే movierulz లో ప్రత్యక్షమయ్యాయి. ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజా weds రాంబాయి సినిమాలు ప్రస్తుతం ఈ పైరసీ సైట్లో అప్లోడ్ చేశారు. థియేటర్ నుండి క్యాం కార్డర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్లు వెబ్సైట్లో కనిపిస్తున్నాయి.
Hyderabad: ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగంబర్‌పేట్‌లో రామకృష్ణ నగర్ విషాదఛాయలు అలముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య (15) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్లో ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు.
CM Revanth Reddy: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.. సత్యసాయి జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. బాబా మనుషుల్లో దేవుని చూశారు.. ప్రేమతో మనుషుల్ని గెలిచారన్నారు. ప్రేమ గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా ట్రస్ట్ ప్రజలకు […]
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు. ఈ వేడుకలకు హిల్ వ్యూ స్టేడియం ముస్తాబైంది. దీంతో పాటు పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Mumbai Cyber Fraud: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక షాకింగ్ సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. షేర్ ట్రేడింగ్ స్కీమ్ ద్వారా ఓ రిటైర్డ్ డాకర్ట్ రూ.1.47 కోట్లు మోసపోయారు. ఆయన మోసపోవడానికి ప్రధాన కారణం ఓ ప్రకటన కావడం సంచలనం సృష్టించింది. బాధితుడి సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రకటన చూసి ఇన్వే్స్ట్మెంట్ పెట్టారు. ఇంతకీ ఆ రిటైర్డ్ వైద్యుడిని అంతలా ప్రలోభపెట్టిన సోషల్ మీడియా ప్రకటన ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? ఇది తెలిస్తే ముక్కన వేలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే..…
Natasa Stankovic New Car: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం నటాషా స్టాంకోవిచ్ తన జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి గ్లామర్ ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచ్‌లకు తరచూ హాజరయ్యే నటాషా.. ఒంటరితనాన్ని ఎంచుకుట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన జీవితం వైపు తిరిగి అడుగులు వేస్తోంది. తనపై వస్తున్న వార్తలకు పెద్దగా స్పందించని నటాషా.. ఇప్పుడు వ్యక్తిగతంగా, ఆర్థికంగా స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కుమారుడు అగస్త్యను చూసుకుంటూనే, తన కెరీర్ మీద కూడా దృష్టి పెడుతోంది.…
Tandur Accident: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.. కూతురు పెళ్లి పనులకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందారు. యలల్ మండలం సగెంకుర్దులో ఘటన చోటు చేసుకుంది. సగెంకుర్దుకి చెందిన అనంతప్ప తన కుమార్తె వివాహం పెట్టుకున్నారు. కూతురు పెళ్లి పనుల నిమిత్తం యాలాల్ మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు చుట్టూ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మరోసారి ఊపందుకుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించామని, ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా తాను అంగీకరిస్తానని ప్రకటించారు.