ఛాపియన్ లాహోర్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లకు ఇది తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బారిలోకి దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట ఆస్ట్రేలియా 43 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు పడగొట్టింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. "హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యాచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీని ఆదరించాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ లాహోర్‌లో జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ఇరు జట్లు మైదానానికి చేరుకున్నాయి. జాతీయ గీతాలు ప్లే చేయడం మొదలు పెట్టారు. గ్రౌండ్ మేనేజ్మెంట్ ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేసింది.
పెళ్లయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ గొడవలు పెద్ద వివాదంగా మారుతాయి. యూపీలోని ఘాజీపూర్ జిల్లా నుంచి ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన పుట్టింటికి వెళ్లింది. ఇదంతా కామన్ అనుకున్న భర్త లైట్ చేసుకున్నాడు. కానీ.. భార్య తండ్రి ఫోన్ చేసిన ఓ విషయం చెప్పాడు. అది విన్న భర్త పోలీస్ స్టేషన్‌కి పరుగులు…
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని చకులియా పోలీస్ స్టేషన్ పరిధి జోడ్సా గ్రామంలో మేకను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భారత మార్కెట్లో టెస్లాకు చెందిన కారు ప్రత్యక్షం కానుంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. టెస్లాకు మార్గం సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రముఖ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక ప్రకారం.. ఇటీవల దిగుమతి సుంకాన్ని 20% కంటే తక్కువగా తగ్గించింది. అయినా.. టెస్లాకు చెందిన అత్యంత సరసమైన మోడల్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ…
కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు అలా సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుకు వెళ్లి బీసీ…
మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది.. 15 స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను…