రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
ప్రముఖ డైరెక్టర్ శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తాజాగా తెలిపింది. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘రోబో’. శంకర్ టేకింగ్, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. అయితే.. ఎక్కువ శాతం మధ్యతరగతి వ్యక్తులు కారును లోన్ తీసుకుని కొంటారు.
కొంత మంది పిల్లలు చదువులో బాగా రానిస్తారు. ఒక్కసారి చదివిన వారు మంచిగా గుర్తుపెట్టుకుని మంచి మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు మాత్రం చదువుల్లో వెనుకబడిపోతారు. ఎన్ని సార్లు చదివిన వారికి గుర్తు ఉండదు. దీంతో ఫెయిల్ అవుతారు. ఈ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ విడుదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 6 – 8 వరకు దరఖాస్తులో తప్పుల సవరించుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించి.. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా.. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్ లోడ్ […]
గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మాట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్కు వచ్చి వెళ్లిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో తవ్వకాలలో శివలింగం బయటపడటంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. శివలింగ దర్శనం కోసం సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రావడం ప్రారంభించారు. శివ లింగ బయటపడ్డ కొద్దిసేపటికే భక్తులు గుమిగూడారు. సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం కూడా అక్కడికి చేరుకుంది. మహాశివరాత్రికి ముందు శివలింగం దొరకడం శుభసూచకమని గ్రామస్థులు చెబుతున్నారు.
మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే.. వారికి కారు అవసరం. అలాంటి వారికి కోసం కొన్ని కార్లను పరిచయం చేస్తాం. కారు కొనాలనుకుంటున్న వారు వీటిని చూసి.. ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి..
దక్షిణకొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 1,380 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ యూనిట్లను 3 మార్చి 2022, 14 ఏప్రిల్ 2023 మధ్య తయారు చేసిన కార్లను రికాల్ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి సమాచారం అందించింది.