టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
READ MORE: PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
కాగా.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. 2014లో అల్లుడు శీను మూవీతో హీరోగా అరంగేట్రం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆ రేంజ్‌లో విజయం సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత 2019లో తమిళ రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అనంతరం మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ, వాటికి యూట్యూబ్‌లో హిందీ వెర్షన్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్, లైక్స్ ఉండటం విశేషం. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసిన కూడా విజయం వరించలేదు. దాంతో ఎలాగైన హిట్ కొట్టెందుకు ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్‌లో 12 వ చిత్రం చేస్తున్నాడు. శ్రీనివాస్ కొత్త ప్రాజెక్ట్ BSS12 ఇప్పటికే షూటింగ్ స్థాయిలో ఉంది.
READ MORE: PM Modi Warns Pak: మన డ్రోన్లు, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి..