సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే కథ చెప్పానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Traffic Restrictions: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
రజినీకాంత్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనకు వేరే కథ చెప్పాను. కానీ అనుకోని కారణాల దృష్ట్యా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చెప్పారు. రెండు నెలలకు పైగా ఆ స్క్రిప్ట్‌పై పని చేసినట్లు తెలిపారు. “ఆ కథ రజినీకాంత్‌కి బాగా నచ్చింది. కానీ.. రెండు నెలల తర్వాత మళ్లీ ఆయనను కలిసి కూలీ కథ చెప్పాను. మొదటి కథ రజనీ కాంత్‌కు నచ్చినప్పటికే ఆ స్టోరీ చేయలేక పోయాం. దానికి కూడా ఓ కారణం ఉంది. వాస్తవానికి నేను అనుకున్న పాయింట్ ఒక చోట పూర్తిగా డౌన్ అయిపోయినట్లు అనిపించింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పోయింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా కొత్త ఆలోచన వస్తే, ఆ కథను అందుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా.” అని దర్శకుడు లోకేష్ కనగరాజ్ వివరించారు.
READ MORE: PM Modi: పాక్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దమ్మేంటో చూపించారు