సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కాం కేసును ఈడీకి రిఫర్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసిన అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసం చేశారు. ఫాల్కన్ ఎండీ, సీఈవో, సీఓలు ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. వారికి సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జల్సాల కోసం అమర్‌దీప్‌కుమార్ చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో తిరిగాడు. కేసు నమోదు కాగానే దుబాయ్‌కి పారిపోయాడు.
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్…
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది.
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో భా్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో ఉండగా.. భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది..
అంబర్‌పేట్‌లో నలుగరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ(13), కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్ధన్(13) నలుగురు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతూ దొరికారు. టీచర్ వారిని మందలించింది..
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో తెలిపారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని స్టార్ హోటల్ అయిన తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్ నిర్వాహకులు గడిచిన రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేయడంతో పాటు పలు మార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని ఏఎంసీ ఉప్పలయ్య తెలిపారు. రెండు సంవత్సరాలుగా సదరు సంస్థ ’ రూ. 1 కోటి 40 లక్షల పన్ను బకాయి ఉన్నారని ఎంతకు స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసినట్లు అధికారులు…
సంగారెడ్డి (మం) ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట అడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి.
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లి లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్ పల్లి చేరుకుంటారు.