Cease Fire Violation : అమృత్‌సర్‌లో కొనసాగుతున్న హైఅలర్ట్.. ప్రజలకు ప్రభుత్వ కీలక సూచనలు!
- పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్
- మరోసారి ప్రజలకు కీలక సూచనలు
- చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన
- ఉదయం 4.39 గంటలకు మార్గదర్శకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్‌సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.
READ MORE: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భద్రతా బలగాలు శత్రు డ్రోన్‌ను గుర్తించాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. వైమానిక రక్షణ విభాగాలు వెంటనే దాన్ని కూల్చివేశాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. కాల్పుల విరమణ అనంతరం కూడా అమృత్‌సర్‌లో రాత్రి డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అమృత్‌సర్ పరిసరాల్లో వరుసగా మిస్సైల్ శకలాలు లభ్యం అవుతుండటంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.
READ MORE: Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
కాగా.. భారత్, పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడందుకున్నాయి. అమెరికా, మరికొన్ని దేశాల దౌత్యంతో.. రెండుదేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (డీజీఎంవో) స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్థాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థంగా నిలువరించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ.. సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు.
Punjab | "By way of abundant caution, please remain indoors with lights off and move away from windows. Please do not move out on the road, balcony or terrace. Don't panic. We will let you know when we can resume normal activities," DC Amritsar, in a guideline issued at 4.39 am
— ANI (@ANI) May 10, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!