భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
READ MORE: Vallabhaneni Vamsi Health Problems: వల్లభనేనికి అనారోగ్యం..! ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు..!
మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీ టీమ్ కోసం సెట్‌లో గరిటపట్టి సందడి చేశారు. వంటలు వండి టీం సభ్యులను ఆకట్టుకున్నారు. తమదైన వంటలతో టీమ్‌కు పసందైన వంటకాలను రుచి చూయించారు. వీడియో ప్రకారం.. సెకండ్ ఆఫ్‌లో భారీ యాక్షన్ బ్లాక్‌ని ప్లాన్ చేసినట్లు దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పాడు. దీన్ని మొదలు పెట్టిన రెండు రోజులకే మంచు మనోజ్, నారా రోహిత్ ఇద్దరూ షాక్ ఇచ్చారన్నాడు. “మీరు షాట్‌కు బ్రేక్ ఇవ్వడం లేదు. దీంతో మేము సరైన ఫుడ్ కూడా తినలేకపోతున్నాం. అందుకే ఈ రోజు లొకేషన్‌లో మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి టైమ్‌కు మీకు పెడతాం” అని ఇద్దరూ తనకు చెప్పారని డైరెక్టర్ వీడియోలో వివరించాడు. వీడియోలో నారా రోహిత్, మంచు మనోజ్ తయారు చేసిన ఫుడ్ తిన్న నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫుడ్ చాలా బాగుందంటూ కీతాబిచ్చారు. సెట్ మొత్తం సందడిగా కనిపించింది.
READ MORE: Indonesia: ఇండోనేషియాలో భారీ పేలుడు.. 13 మంది మృతి
A hectic shoot…
Electrifying action…
And amidst it all, the #Bhairavam family celebrates a grand feast ❤️🔥▶️ https://t.co/mNXmDhghqQ #BHAIRAVAM IN CINEMAS WORLDWIDE ON MAY 30th 🔱💥@HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl… pic.twitter.com/r0M9G9Ierr
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 12, 2025