రివోల్ట్ మోటార్స్ భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ బైక్‌ల శ్రేణిని విస్తరించింది. కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రివోల్ట్ ఆర్వీ బ్లేజ్ ఎక్స్ (Revolt RV BlazeX) ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్వీ1 కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది.
యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు.
జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ (MG Comet EV Blackstorm) వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.
రేపు మహా శివరాత్రి పర్వం.. హిందువులకు ఇదో పెద్ద పండుగ. జాగారాలు, ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులు స్థానిక శివాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తారు. కానీ.. కొందరు వృత్తి రీత్యా హైదరాబాద్‌కి వచ్చి శివరాత్రికి ఇంటికి వెళ్ల లేక పోతారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం, పట్నంకి దగ్గర్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం...
‘పెద్దల మాట చద్ది మూట’ అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పెద్దలు చెప్పే విషయాలు మన మంచికే అని దీని అర్థం. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు ఉదయాన్నే అందరూ టిఫిన్‌కు ఎగబడుతున్నారు. పూర్వకాలంలో మన తాతాముత్తాతలు చద్దన్నం తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఎన్నాళ్లయినా సంపూర్ణ ఆరోగ్యంగా…
మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు.
రేపే మహా శివరాత్రి. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం. శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేసి శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
రేపే మహా శివరాత్రి. ఇది పరమేశ్వరుడి భక్తులందరికీ అత్యంత ఇష్టమైన రోజు. అంతే కాకుండా జ్యోతిష్య ప్రకారం కూడా చాలా కీలకం. ఉచ్ఛ స్నథితిలో శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శని రాశులు మహా శివరాత్రి నుంచి సంచారం చేయనున్నాయి. ఈ రోజున భక్తులు శైవ క్షేత్రాలకు పరుగులు తీస్తుంటారు. శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. కానీ.. శివుడి పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..