మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ బ్లాక్ బస్టర్ హిట్.. రామ రామ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ పాటకు 25+ మిలియన్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. గత నెల ఏప్రిల్ 12న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఫస్ట్ సింగిల్ “రామ రామ” సాంగ్ తో ప్రారంభించారు. “జై శ్రీ రామ్” అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్ గా నిలిచింది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మ్యాసీవ్ సెట్.. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
READ MORE: CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..!
కాగా.. చిరంజీవి కథానాయకుడిగా… యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్.ప్రకాశ్.
READ MORE: N. Mohanakrishna: మనవడి కోసం ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు!