Jaipur: ఆభరణాల్లో వాటా కోసం తల్లి అంత్యక్రయలు ఆపిన కుమారుడు..(వీడియో)
- బెహ్రోర్ జిల్లా లీలా కా బాస్ గ్రామంలో ఘటన
- ఆభరణాలు ఇవ్వాలని తల్లి చితిపై పడుకున్న కొడుకు
- రెండు గంటలు ఆగిన దహనం సంస్కారాలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ.. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు. తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఈ ఘటన తాజాగా జైపూర్‌లోని విరాట్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
READ MORE: Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..
Also Read
రాజస్థాన్ కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లా లీలా కా బాస్ గ్రామానికి చెందిన భూరి దేవి(80) మే 3న మరణించారని స్థానికులు తెలిపారు. ఆమెకు ఏడుగురు కుమారులు ఉన్నారు. అందులో ఆరుగురు గ్రామంలో కలిసి నివసిస్తున్నారు. ఐదవ కుమారుడు ఓంప్రకాష్ విడివిడిగా నివసిస్తున్నాడు. ఓంప్రకాష్, అతని తోబుట్టువుల మధ్య చాలా సంవత్సరాలుగా ఆస్తి వివాదం సాగుతోంది. తన తల్లి చనిపోయే రోజు వరకు ఆమె బాధ్యతలను పెద్ద కొడుకు చూసుకున్నాడు. అయితే.. ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాలు కుటుంబ పెద్దలు పెద్ద కొడుకుకి అప్పగించారు.
READ MORE: Indus Water Treaty: పాక్‌కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..
అయితే.. ఇంట్లో చివరి కర్మలు పూర్తి చేశారు. అంత్యక్రియల ఊరేగింపు శ్మశాన వాటికకు చేరుకుంది. ఓంప్రకాష్ కూడా శవపేటికను తీసుకెళ్లడానికి సహాయం చేశాడు. దహన సంస్కార స్థలానికి చేరుకున్న ఓంప్రకాష్ వెంటనే ఆందోళన చేయడం ప్రారంభించాడు. తన తల్లి చితిని తగుల బెట్టకుండా, అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు. అకస్మాత్తుగా ఆ చితిపై పడుకున్నాడు. తన తల్లి ఆభరణాలు తనకు ఇవ్వకపోతే దహన సంస్కారాలు చేయనివ్వను అని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, ఓంప్రకాష్ దాదాపు రెండు గంటల పాటు చితిపై నుంచి దిగడానికి నిరాకరించాడు. ఆభరణాలను దహన సంస్కారాల స్థలానికి తీసుకువచ్చి అతనికి అప్పగించిన తర్వాతే భూరి దేవి అంత్యక్రియలు పూర్తి చేయడానికి అనుమతించాడు. ప్రస్తుతం ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు ఓం ప్రకాష్‌పై మండిపడుతున్నారు.
इंसान किधर जा रहा है ?
राजस्थान के शाहपुरा में चांदी के कड़े के लिए बेटे ने माँ का अंतिम संस्कार रोका! अर्थी पर लेट गया।#rajasthan pic.twitter.com/nuw5wfQfP7— Mukesh Mathur (@mukesh1275) May 16, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?