స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశాడు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశాడు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాస్ వీడియోలో తెలిపాడు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించాడు. సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపాడు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ…
ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? తెలంగాణ క సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. చిట్టిల పేరుతో కుచ్చుటోపి పెట్టిన మరో కేటుగాడి కేసు వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల మేర నట్టేట ముంచినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ సీ టైప్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఈ మోసానికి పాల్పడ్డాడు.
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు…
మంచిర్యాల జిల్లా.. నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై ఎస్సై దురుసుగా ప్రవర్తించాడని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. తమపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు.. పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
హైదరాబాద్ లో హెచ్ సీఎల్ కేఆర్ సీ క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిరోజూ తాము బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో.. పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో.. గత సంవత్సరం సంతకం చేసిన ఎంఓయూల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోందని తెలిపారు. గురువారం HCL టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ విజయం సాధించాలంటే కష్టపడాలి. విజయం మనల్ని జీవితంలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. కానీ వైఫల్యం మనల్ని భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపేలా చేస్తుంది. జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కూడా.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక భర్త తన వికలాంగ భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలను అమ్మేశాడు. భార్య నిద్రపోతుండగా.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని ఆరోపణలు వచ్చాయి. భర్త అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. భార్య డబ్బు ఇవ్వక పోవడంతో ఈ నీచమైన పని చేశాడని భార్య పేర్కొంది.