-
Tuni Minor Rape: తుని అత్యాచారం కేసు.. చెరువులోకి దూకిన నిందితుడు..
Tuni Minor Rape: దూకిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు తుని కోమటి చెరువులోకి దూకాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు. నారాయణరావు ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. -
AP: మరో రూ. 2700 కోట్లు విడుదల చేయాల్సిందే.. నేడు ఎన్టీఆర్ వైద్య సేవ ఆస్పత్రుల ధర్నా..
AP: ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యథాతథంగా కొనసాగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నాట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా సాగనుంది. రూ.2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆషా డిమాండ్ చేస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్.. -
TTD: అలర్ట్.. నేడే తిరుమల శ్రీవారి జనవరి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
TTD: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదలవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి. -
Medchal: గోరక్షక్‌దళ్ సభ్యుడిపై ముస్లిం యువకుడి కాల్పులు.. గోవుల తరలింపు సమాచారం ఇస్తానని పిలిచి..
Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం ఇస్తానని కాల్పులకు ఇబ్రహీం తెగబడ్డాడు. -
Pakistan: జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ నయా ప్లాన్.. ఆన్లైన్లో ముస్లిం మహిళలకు జీహాదీ క్లాసులు..!
Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో "జమాత్ ఉల్ ముమినాత్" పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం "జమాత్ ఉల్-ముమినత్" కోసం నియామకాలను విస్తరించడానికి తాజాగా మరో ప్లాన్ వేసింది. -
Mullah Yaqoob: భారత్ ఆఫ్ఘన్‌కు సపోర్ట్ చేసిందా..? క్లారిటీ ఇచ్చిన ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి..
Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర దేశం. భారతదేశం, పాకిస్థాన్లతో మన సంబంధాలు… -
Story of Satish Prasad Singh: ఐదు రోజుల సీఎం.. బీహార్ తొలి ఓబీసీ ముఖ్యమంత్రి కథ..!
Story of Satish Prasad Singh: బీహార్ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా… -
KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి. -
IPhone 17 Pro: రూ.1.35 లక్షల విలువైన ఐఫోన్ 17 ప్రో.. కేవలం రూ. 40 వేలకే.. ట్రిక్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
చాలా మంది ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని తహతహలాడుతుంటారు. కానీ అధిక ధర కారణంగా కొనలేక పోతారు. ఫోన్ ధర తగ్గేందుకు కొంత మంది పాత హ్యాండ్సెట్లను అమ్ముతారు లేదా ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ప్రత్యేకమైన రీతిలో రూ.1.35 లక్షల విలువైన ఐఫోన్ 17 ప్రోను కేవలం రూ.40,470కే కొనుగోలు చేశాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. -
Karthika Masam 2025: నేటి నుంచి కార్తీక మాసం.. తప్పక చేయాల్సిన పూజలు, పనులు ఇవే..
Karthika Masam 2025: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి (అక్టోబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది.. విశిష్టమైనదని స్కంద పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది. అయితే.. ఈ మాసంలో తప్పక చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..