బీహార్ రాజధాని పాట్నా నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. నిన్న రాత్రి, SK పూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌పురి ప్రాంతంలో సంజన అనే యువతి తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమె సజీవ దహనమై కనిపించింది. సంజన మెడను ఎవరో నరికారు. ఆమె శరీరంపై అనేక దెబ్బలు కనిపించాయి. ఈ విధంగా.. 28 ఏళ్ల సంజన కుమారి తన సొంత ఫ్లాట్‌లోనే దారుణంగా హత్య చేయబడింది. సంజన స్నేహితుడు సూరజ్ కుమార్ ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
READ MORE: Balochistan: బలూచిస్తాన్ పరిణామాల నేపథ్యంలో.. పాక్‌లోని ఈ రెండు హిందూ ఆలయాలపై చర్చ..
పోలీసుల కథనం ప్రకారం.. ముజఫర్‌పూర్‌లోని సక్రా నివాసి అయిన సంజన కుమారి, ఆనంద్‌పురిలోని మనోరమ అపార్ట్‌మెంట్ వెనుక ఉన్న ఓ భవనంలో ఒంటరిగా నివసిస్తోంది. ముజఫర్‌పూర్‌లోని MDDM కళాశాల నుంచి BBA చేసిన ఆమె.. బీహార్‌లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగానికి ఎంపికైంది. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కాగా.. ముజఫర్‌పూర్‌కు చెందిన సూరజ్ కుమార్ నిన్న మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సంజన ఫ్లాట్‌కు బ్యాక్‌ప్యాక్‌తో వచ్చాడు. ఇద్దరూ మంచి స్నేహితులు.
READ MORE: RCB vs KKR: హిట్టర్ల సమరంలో గెలిచేదెవరు?
వీరిద్దరి మధ్య ఏదో ఒక అంశంలో గొడవ తలెత్తింది. వివాదం ముదరడంతో సూరజ్ వంటగది నుంచి కత్తిని తీసుకుని సంజన మెడ, కడుపు, వీపుపై అనేకసార్లు పొడిచాడు. గాయపడిన ఆమెను గదిలోనే ఉంచి గ్యాస్ సిలిండర్ తెచ్చి దాని పైపును కత్తిరించి, లీకైన గ్యాస్‌కు నిప్పుపెట్టాడు. సంజన ఈ దాడిలో పూర్తిగా కాలిపోయింది. సూరజ్ దాదాపు 3 గంటలకు పారిపోయాడు. సంజన మొబైల్, ల్యాప్‌టాప్, ఫ్లాట్ కీని తన బ్యాక్‌ప్యాక్‌లో వేసుకుని పారారయ్యాడు. ఫ్లాట్‌లో పనిచేస్తున్న పనిమనిషి ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సీసీటీవీ ఫుటేజీలో సూరజ్ కుమార్ అనే వ్యక్తి ఫ్లాట్ నుంచి పారిపోతున్నట్లు కనిపించింది.