బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రియా చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. అలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. ఈ అంశం ప్రస్తుతం రెడ్డిట్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతిభ, పట్టుదలకు సలాం కొట్టాల్సిందే. ఐదు దశాబ్దాలుగా ఆయన యాక్టింగ్‌తో అభిమానులను కట్టి పారేశారు. చిత్ర పరిశ్రమలో "బిగ్ బీ" అని ముద్దుగా పిలువబడే ఆయన లెక్కలేనన్ని హిట్లను అందించారు. 82 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఆయన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి ప్రజలకు ఆయన సక్సెస్ మాత్రమే తెలుసు. కానీ.. 90లలో బిగ్ బీ పడిన ఇబ్బందుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. కొన్నింటిలో ప్రజల సృజనాత్మకత మనల్ని అబ్బుర పరుస్తుంది. అదే వీడియోను ఓ సెలబ్రిటీ షేర్ చేస్తే.. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. ఇందులో కొంతమంది పిల్లలు సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. ఈ టూ వీలర్లో ఒకేసారి 7…
మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు.
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్‌ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్‌ఫామ్‌గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. 'ఇది వెళ్ళే సమయం...' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు రాజబాబు (65) ఈరోజు (ఫిబ్రవరి 28) మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు. రాజబాబు నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.26 గంటలకు తుదిశ్వాస విడిచారు.
సినీ సెలబ్రేటీలు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయం వైపు వెళ్లాలను కుంటారు. కొందరు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. బాలీవుడ్ లో నటులే కాకుండా నటీమణులు సైతం రాజకీయంలో సత్తాచాటుతున్నారు. దీనికి ఉదాహరణ కంగనా రనౌత్.. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రీతి జింటాకు ఓ ప్రశ్న ఎదురైంది
మల్లూవుడ్.. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుటోంది. ఈ ఏడాది జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన "ఆఫీసర్ ఆన్ డ్యూటీ" కూడా అదే ఫ్లోలో దూసుకుపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ ఈ సినిమాలో తన ప్రతిభ కనబరిచాడు.